
భారత్ వాయు సేనకు 114 ఎఫ్-21 యుద్ధ విమానాలను సరఫరా చేసేందుకు లాక్‌హీడ్ మార్టిన్ సుముఖంగా ఉంది. దీని కోసం టాటా గ్రూప్‌తో కలిసి ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ఈ కాంట్రాక్ట్ తమకు ఇస్తే ఎఫ్-21 యుద్ధ విమానాలను భారత్‌లోనే తయారు చేయనున్నట్లు తెలిపింది.
ఈ యుద్ధ విమానాల కాంట్రాాక్ట్ లభిస్తే భారత్- యూఎస్ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైనట్లు అవుతుందని లాక్‌హీడ్ మార్టిన్ పేర్కొంది. టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ (టీఎల్ఎంఏఎల్) 2010లో ఏర్పాటైంది. అప్పటికే ఇక్కడ విమానాలకు అవసరమైన పలు విడిభాగాలు, స్ట్రక్చర్లు ఉత్పత్తి చేస్తున్నారు.
విమానాల్లో రెక్కలు ఎంతో ముఖ్యమన భాగం. కీలకమైన విడిభాగాల ఉత్పత్తి చేసే అవకాశం లభించడంపై టాటా గ్రూప్ సంతోషం వ్యక్తం చేసింది. లాక్‌హీడ్ మార్టిన్ కార్పొరేషన్ యూఎస్‌లోని మేరీల్యాండ్ కేంద్రంగా పని చేస్తోంది. యుద్ధ విమానాలకు రూపకల్పన చేయడం నుంచి పరిశోధన, ఉత్పత్తి వరకు విస్తృత స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థకు చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాలు ఎన్నో ఏళ్లుగా వివిధ దేశాల్లో వాయుసేనలో సేవలు అందిస్తున్నాయి.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు