భార‌త్‌కే బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీ.. డబ్ల్యుటిసి ఫైనల్లో

భార‌త్‌కే బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీ.. డబ్ల్యుటిసి ఫైనల్లో
ఆస్ట్రేలియా, ఇండియా మధ్య అహ్మాదాబాద్‌లో మ‌ధ్య జ‌రిగిన నాలుగ‌వ టెస్టు డ్రాగా ముగిసింది. ఆట చివ‌రి రోజున టీ బ్రేక్ త‌ర్వాత ఆస్ట్రేలియా త‌న రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 175 ర‌న్స్ చేసింది. ఆ ద‌శ‌లో ఇద్ద‌రు కెప్టెన్లు డ్రాకు అంగీక‌రించారు.
రవింద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌లు గెలుచుకున్నారు.
నాలుగు టెస్టులో భారీ శతకం బాదడంతో విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆస్ట్రేలియా ఐదో రోజు రెండు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసిన అనంతరం డిక్లెర్డ్ చేయడంతో డ్రాగా ముగిసింది.  మ్యాచ్ డ్రా కావ‌డంతో.. టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో భార‌త్ వ‌శం చేసుకున్న‌ది. దీంతో బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ భారత్ కే ద‌క్కింది. 
మొట్టమొదటిసారిగా వరుసగా నాలుగోసార్లు బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని గెలిచిన జట్టుగా నిలిచింది టీమిండియా. తొలి మూడు టెస్టులు మూడేసి రోజుల్లోనే ముగిసినా, నాలుగో టెస్టులో మాత్రం అయిదు రోజుల్లో కేవ‌లం 20 వికెట్లు మాత్ర‌మే ప‌డ్డాయి.  మొదటి రెండు టెస్టు టీమిండియా గెలవగా మూడో టెస్టు ఆసీస్ విజయం సాధించింది. నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. అయితే ఇండియా, ఆస్ట్రేలియా జ‌ట్లు మ‌ళ్లీ జూన్‌లో జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌(డబ్ల్యుటిసి)లో పోటీప‌డ‌నున్నాయి.
 
మరోవంక, శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టులో కివీస్ విజయం సాధించడంతో టీమిండియా డబ్ల్యుటిసి ఫైనల్‌కు చేరుకుంది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో భారత్‌తో పోటీపడిన శ్రీలంక న్యూజిలాండ్‌ చేతిలో ఓడింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో లంకపై న్యూజిలాండ్‌ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
 
శ్రీలంక నిర్దేశించిన 285 పరుగుల లక్ష్యాన్ని 8 ఎనిమిది వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్‌ ఛేదించింది. శ్రీలంక ఓడిపోవడంతో ఆస్ట్రేలియాతో చివరిదైన నాలుగో టెస్టులో గెలుపోటములతో సంబంధం లేకుండా టీమిండియా ఫైనల్‌ బెర్తు దక్కించుకుంది. వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌కు టీమిండియా అర్హ‌త సాధించ‌డం ఇది వ‌రుస‌గా రెండోసారి.