
కలకలం రేపుతున్న పిజి మెడికో ప్రీతీ ఆత్మహత్యకు పాల్పడలేదని, హత్యా ప్రయత్నంకే గురయినదని క్రమంగా ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆమె శరీరంలో విష రసాయనాల ఆనవాళ్ళు ఏవీ లేవని టాక్సికాలజీ రిపోర్ట్ స్పష్టం చేయడంతో ఆత్మహత్య నుండి అనుమానాస్పద మృతి కింద కేసును పోలీసులు మారిచే విషయం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
నిపుణులు చేసిన టాక్సికాలజీ రిపోర్ట్‌లో ఈ విషయం వెల్లడైంది. గుండె, కాలేయం, రక్తంతో పాటు- పలు అవయవాల్లో విషపదార్థాల ఆనవాళ్లు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్ పేర్కొంది. అయితే, “డయాలసిస్ చేయడంతో బ్లడ్ మొత్తం పోయింది. అప్పుడే ఎక్కించిన రక్తం నుంచి టాక్సికాలజీ రిపోర్ట్‌కు పంపించారు. దీంతో నెగిటివ్ వచ్చి ఉండొచ్చు” అని ప్రీతీ తల్లి శారద చెప్పారు. సైఫ్‌తో పాటు మరి కొంతమంది సీనియర్లు ప్రీతిని వేధించారని పేర్కొంటూ వారి ప్రమేయం బయట పడుతుందని, ఈ కేసులో ఇరుక్కుంటామని సైఫ్‌కి సపోర్ట్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఈ కేసులో ఇప్పటికే యాంటీ ర్యాగింగ్ కమిటీ-, పోలీసులు విచారణ ముమ్మరం చేయగా జూనియర్ మెడికో వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. పోలీస్ విచారణ, యాంటీ ర్యాగింగ్ కమిటీలో కీలక జూనియర్ డాక్టర్ విషయాలను బయట పెట్టినట్టు తెలుస్తోంది. ప్రీతి అనస్థీషియా రిపోర్ట్ వివాదంలో డాక్టర్ సైఫ్ చెప్పిన అభిప్రాయానికి భిన్నమైన విషయాలను డాక్టర్ ప్రీతి జూనియర్ వెల్లడించినట్టు సమాచారం. పీఏసీ రిపోర్ట్ విషయంలో డాక్టర్ సైఫ్ ఫిజికల్‌గా లేకున్నా డాక్టర్ ప్రీతిని బ్లేమ్ చేసినట్టు నిర్ధారించారు.
జీఎంహెచ్‌లో జూనియర్ విద్యార్థినికి డిక్టేట్ చేస్తూ పీఏసీ రిపోర్ట్‌ని డాక్టర్ ప్రీతి ఫైండింగ్స్‌లో పొందుపరిచినట్లు-విచారణలో కొత్త కోణం వెలుగు చూసింది. డాక్టర్ సైఫ్ తనను కావాలని వేధిస్తున్నాడని, పీఏసీ రిపోర్ట్ వివాదం వివ రించి తనకు సపోర్ట్ చేయాలని ప్రీతి అర్థించినట్టు జూనియర్ డాక్టర్ వాంగ్మూ లం ఇచ్చినట్టు తెలుస్తోంది.
తనపై కుట్ర జరుగుతోందని ప్రీతి తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైనట్టు జానియర్ డాక్టర్ తెలిపింది. ఇదే విషయమై లాస్ట్ కాల్‌లో సహ విద్యార్థితో తన ఆవేదన వ్యక్తం చేసినట్టు- కూడా తెలుస్తోంది. జూనియర్ డాక్టర్ వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న విచారణ బృందం మెడికో ప్రీతి లాస్ట్ కాల్‌పై పూర్తి స్థాయి సమాచారం సేకరిస్తోంది.
పీఏసీ రిపోర్ట్ విషయంలో నిందితుడు డాక్టర్ సైఫ్ వాదన అవాస్తవమని పోలీస్ విచారణలో తెలుస్తోంది. డాక్టర్ సైఫ్, డాక్టర్ ప్రీతి మధ్య వివాదంగా మారిన ప్రశ్నించేతత్వం, దానికి సంబంధించిన చాట్స్ కూడా లభ్యమైనట్టు సమాచారం. మొబైల్ డేటా, సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ ఆధారాలను బేస్ చేసుకుని పోలీసు అధికారులు కేసులో ముందుకెళ్తున్నారు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు