
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డారు. నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కే’ చిత్రంలో అమితాబ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. 80 ఏళ్ల వయస్సులోనూ ఆయన వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.
యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్న సమయంలో అమితాబ్ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. పక్కటెముక మృదులాస్థి విరిగిందని, కుడి పక్కటెముక కండరం చిరిగిపోయిందని అమితాబ్ స్వయంగా తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. తాను గాయపడటంతో షూటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పారు.
నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అమితాబ్ ముంబయికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ముంబయిలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు అమితాబ్ తెలిపారు.
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రాజెక్ట్-కె సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే 70శాతం షూటింగ్ కూడా పూర్తయింది. సై-ఫై జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు