
ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2013లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన 123 భూములను తాజాగా కేంద్రం స్వాధీనం చేసుకుంది. ఈమేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు 123 ఆస్తుల వద్ద నోటీసులు అంటించారు. వీటిలో దర్గాలు, మసీదులు కూడా ఉన్నాయి.
ఢిల్లీలోని 123 ప్రాంతల్లోని అత్యంత విలువైన భూములను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2014 లోక్ సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు కేటాయించింది. దీన్ని సవాల్ చేస్తూ అదే సమయంలో విశ్వహిందూ పరిషద్ కోర్టును ఆశ్రయించింది. ఒకవైపు ఈ అంశం కోర్టులో విచారణలో ఉండగా మరోవైపు బీజేపీ ప్రభుత్వం దీనిపై రెండు విచారణ కమిషన్లు (ఏకసభ్య, ద్విసభ్య కమిషన్లు) నియమించింది. ఈ అంశంపై విచారణ చేసిన కమిషన్లు 123 ఆస్తుల విషయమై తమ ఎదుట హాజరవ్వాల్సిందిగా ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు నోటీసులు జారీ చేసినప్పటికీ వక్ఫ్ బోర్డు పట్టించుకోలేదు. ఈ విషయమై ఢిల్లీ వక్ఫ్ బోర్డు కనీసం తమ అభ్యంతరాలను కూడా దాఖలు చేయలేదని రిపోర్టులో ద్విసభ్య కమిషన్ వెల్లడించింది.
దీంతో ఆ 123 ఆస్తుల విషయంలో ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు ఏమాత్రం ఆసక్తి లేదన్న అభిప్రాయాన్ని ద్విసభ్య కమిషన్ తమ రిపోర్టులో వెల్లడించింది. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉంటూ వచ్చిన 123 ఆస్తులను డీ-నోటిఫై చేస్తూ చర్యలు తీసుకుంది.
కేంద్రం చర్యలతో ఉలిక్కిపడ్డ ఢిల్లీ వక్ఫ్ బోర్డు, ఈ విషయమై హుటాహుటిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు లేఖ రాసింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఆస్తుల స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని వాదిస్తున్నారు.
వక్ఫ్ అంటే ఏంటి, వక్ఫ్ చట్టం దేశంలో ఎలా అమలవుతోంది, వక్ఫ్ బోర్డు చర్యలు సామాన్యులకు ఎలా సమస్యగా మారుతున్నాయి, దేశ ప్రగతికి ఎలా అవరోధం కలిగిస్తున్నాయి.. ఈ అంశాలపై నిజం టుడే విశ్లేషణ ఈ క్రింది వీడియోలో చూడవచ్చు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్