ఈ బడ్జెట్ పేదలకు ప్రాధాన్యాన్ని ఇస్తున్నది

భారతదేశపు ‘అమృత కాలం’లో తొలి బడ్జెట్ అభివృద్ధి చెందిన భారతదేశం ఆకాంక్షలను, సంకల్పాలను నెరవేర్చేందుకు ఒక గట్టి పునాదిని వేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ బడ్జెటు వంచితులకు ప్రాథమ్యాన్ని కట్టబెట్టిందని, మరి ఇది ఆకాంక్ష భరిత సమాజం, పేద ప్రజలు, పల్లె వాసులు, ఇంకా మధ్య తరగతి ప్రజానీకం ల యొక్క కలల ను నెరవేర్చడం కోసం పాటుపడుతుందని కూడా ఆయన పేర్కొన్నారు.

ఒక చరిత్రాత్మకమైన బడ్జెటును ఇచ్చినందుకు ఆర్థిక మంత్రిని,ఆమె జట్టును ప్రధాన మంత్రి అభినందించారు. వడ్రంగులు, కమ్మరులు, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు వంటి సాంప్రదాయక చేతి వృత్తుల వారు, ఇతర అనేక మంది దేశానికి సృష్టికర్తగా ఉన్నారని ప్రధాన మంత్రి తెలిపారు.

‘‘మొట్ట మొదటిసారిగా దేశం ఈ ప్రజల కఠోర శ్రమ, సృజనలకు ప్రశంసా అన్నట్లుగా అనేక పథకాల తో ముందుకు వచ్చింది. వీరికి శిక్షణ ను ఇవ్వడానికి, రుణాలు మంజూరు చేయడానికి, మార్కెట్ పరంగా సమర్థనను అందించడానికి తగిన ఏర్పాట్లు జరిగాయి. పిఎమ్ విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ అంటే, అదే.. సంక్షిప్తం గా ‘పిఎమ్-వికాస్’.. కోట్ల కొద్దీ విశ్వకర్మల జీవితాలలో ఒక పెద్ద మార్పును తీసుకు రానుంది’’ అని ప్రధాన మంత్రి వివరించారు.

నగరాల మొదలుకొని గ్రామాలలో మనుగడ సాగిస్తున్న మహిళల నుండి, ఉద్యోగాలు చేసుకొనే వారు మొదలుకొని గృహిణుల వరకు చూస్తే ప్రభుత్వం జల్ జీవన్ మిశన్, ఉజ్జ్వల యోజన మరియు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన తదితర ముఖ్యమైన చర్యలను చేపట్టిందని ప్రధాన మంత్రి తెలిపారు. ఈ చర్యలు మహిళల సంక్షేమానికి మరింత అండదండలను అందిస్తాయని ఆయన చెప్పారు.

అమిత సామర్థ్యం కలిగినటువంటి రంగాలలో ఒక రంగం అయిన మహిళా స్వయం సహాయ సమూహాలను మరింత గా బలపరచడం జరిగిందా అంటే గనక అద్భుత కార్యాలను సాధించవచ్చని ఆయన స్పష్టం చేశారు. కొత్త బడ్జెటులో మహిళల కోసం కొత్తగా ఒక ప్రత్యేకమైన పొదుపు పథకాన్ని ప్రారంభించడంతో మహిళా స్వయం సహాయ సమూహాల విషయంలో ఒక కొత్త పార్శ్వాన్ని జత పరచినట్లు అయిందని ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రకటిస్తూ, ఇది మహిళలను ప్రత్యేకించి సామాన్య కుటుంబాలలోని గృహిణుల ను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

ఈ బడ్జెటు సహకార సంఘాల ను గ్రామాలు ప్రధానమైనటువంటి ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధికి ఒక ఆధారం గా తీర్చిదిద్దుతుందని ప్రధాన మంత్రి తెలిపారు. ప్రభుత్వం సహకార రంగంలో ప్రపంచంలోనే అతి పెద్దది అయినటువంటి ఆహార నిలవ పథకాన్ని రూపొందించిందని ఆయన చెప్పారు.

కొత్త ప్రాథమిక సహకార సంఘాలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఒక మహత్వకాంక్షయుక్త పథకాన్ని బడ్జెటులో ప్రకటించడమైంది. ఇది వ్యవసాయంతో పాటుగా పాడి రంగం తో పాటు చేపల ఉత్పత్తి రంగం పరిధి ని విస్తరింపచేస్తుంది, అంతేకాక రైతులు. పశుపోషణ లో నిమగ్నం అయిన వారు మరియు మత్స్యకారులు కూడా వారి ఉత్పత్తుల కు మెరుగైన ధరలను అందుకొంటారని ఆయన వివరించారు.

 డిజిటల్ పేమెంట్స్ యొక్క సాఫల్యాన్ని వ్యవసాయ రంగంలో సైతం ఆచరణలోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఈ బడ్జెటు డిజిటల్ ఏగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఒక పెద్ద ప్రణాళికతో ముందుకు వచ్చింది అని ఆయన చెప్పారు. ప్రపంచం చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరాన్ని జరుపుకొంటోందని ప్రధాన మంత్రి చెప్తూ, భారతదేశంలో అనేకమైనటువంటి పేరులతో ఎన్నో రకాల చిరుధాన్యాలు ఉన్నాయన్న సంగతిని ప్రస్తావించారు.

చిరుధాన్యాలు ప్రపంచవ్యాప్తంగా అనేక కుటుంబాల చెంతకు చేరుతూ ఉన్నాయి అంటే మరి అలాంటప్పుడు చిరుధాన్యాల కు ప్రత్యేకమైన గుర్తింపు అనేది అవసరం అని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘ఈ సూపర్ ఫూడ్ ‘శ్రీ-అన్నాని’ నకి ఒక కొత్త గుర్తింపును ఇచ్చింది’’ అని ఆయన చెప్పారు. దేశంలోని చిన్న రైతులు, ఆదివాసీ వ్యవసాయదారులు ఆర్థికంగా మద్ధతును అందుకోవడమే కాకుండా దేశంలోని పౌరులకు ఒక ఆరోగ్యదాయకమైనటువంటి జీవితం కూడా లభిస్తుంది అని ప్రధాన మంత్రి చెప్పారు.

 ఈ బడ్జెటు ఒక సుస్థిర భవిష్యత్తు కై గ్రీన్ గ్రోథ్, గ్రీన్ ఇకానమీ, గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇంకా గ్రీన్ జాబ్స్ లకు ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి స్థాయిలో విస్తరణకు అవకాశాన్ని ఇస్తుందని నరేంద్ర మోదీ అభిలాష వ్యక్తం చేశారు.

‘‘బడ్జెటులో మేం సాంకేతిక విజ్ఞానానికి, కొత్త ఆర్థిక వ్యవస్థకు ఎక్కడలేని ప్రాధాన్యాన్ని ఇచ్చాం. నేటి కాలానికి చెందిన ఆకాంక్ష భరిత భారతదేశం రహదారులు , రైలు మార్గం, మెట్రో, నౌకాశ్రయాలు, ఇంకా జల మార్గాలు .. ఇలా ప్రతి రంగంలోను ఆధునిక మౌలిక సదుపాయాలు కావాలని కోరుకొంటున్నది. 2014వ సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు మౌలిక సదుపాయాలలో పెట్టుబడి 400 శాతానికి పైగా వృద్ధి చెందింది’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.

మౌలిక సదుపాయాల కల్పనలో 10 లక్షల కోట్ల రూపాయల అపూర్వ మైనటువంటి పెట్టుబడి భారతదేశం యొక్క అభివృద్ధికి సరికొత్త శక్తిని, వేగాన్ని ప్రసాదిస్తుందని ఆయన చెప్పారు. ఈ పెట్టుబడులు యువతకు వినూత్నమైన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని ఆయన తెలిపారు. వీటి ద్వారా జనాభాలో ఎక్కువ శాతానికి నవీనమైన ఆదాయ ఆర్జన అవకాశాలు అందివస్తాయని ఆయన చెప్పారు.

పరిశ్రమలకు రుణ సమర్థన, సంస్కరణ ల కార్యక్రమం ద్వారా వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్ని మరింత ముందుకు తీసుకు పోవడం జరిగిందని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

‘‘ఎమ్ఎస్ఎమ్ఇ ల కోసం ర2 లక్షల కోట్ల రూపాయల అదనపు రుణ పూచీకత్తు ను ఇవ్వడమైంది’’ అని ఆయన గుర్తు చేశారు. సంభావ్య పన్ను తాలూకు పరిమితి ని పెంచడం అనేది ఎమ్ఎస్ఎమ్ఇ వర్ధిల్లడానికి సహాయకారి అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎమ్ఎస్ఎమ్ఇ లకు పెద్ద కంపెనీ లు సకాలం లో చెల్లింపులు జరిపేటట్లుగా ఒక కొత్త ఏర్పాటును తీసుకు రావడమైంది అని కూడా ఆయన చెప్పారు.

2047 నాటి కలలను పండించుకోవడంలో మధ్య తరగతికి గల సత్తాను ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. మధ్య తరగతి ని సశక్తంగా మార్చడం కోసం ప్రభుత్వం గత కొన్నేళ్ళుగా ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకొంది, మరి ఆ నిర్ణయాల వల్ల జీవించడంలో సౌలభ్యం ఒనగూరిందని ప్రధాన మంత్రి వివరించారు.

ఈ సందర్భంలో ఆయన పన్ను రేట్ల తగ్గింపుతో పాటు పన్ను రేట్లలను సరళతరం చేయడం, పారదర్శకతను తీసుకు రావడం గురించి, ప్రక్రియలను వేగవంతం చేయడం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రధాన మంత్రి చివరగా ‘‘మా ప్రభుత్వం ఎప్పుడూ మధ్య తరగతి వెన్నంటి నిలచింది; వారికి పన్నుల పరం గా భారీ సహాయాన్ని అందించింది’’ అంటూ ముగించారు.