ఈ తరహాలో విమానాల్లో ప్రయాణికులు హద్దు మీరి ప్రవర్తిస్తున్న ఘటనలు మరికొన్ని వెలుగు చూశాయి. ఈ తరహా ఘటనలను నివారించడం కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలియజేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ విజయసాయిరెడ్డి పౌరవిమానయాన శాఖకు లేఖ రాశారు.
సోమవారం మధ్యాహ్నం జరిగిన కమిటీ సమావేశంలో ఈ అంశం గురించే లోతుగా చర్చ జరిగినట్టు తెలిసింది. నాన్-లీథల్ (ప్రాణాపాయం లేని) ఆయుధాలను ఉపయోగించి హద్దుమీరి ప్రవర్తించే ప్రయాణికులను కట్టడి చేసే అంశంపై కూడా చర్చించారు.
మనిషిని కొన్ని క్షణాలు లేదా నిమిషాల పాటు అచేతనావస్థలోకి తీసుకెళ్లి తరహా ‘షాక్’ ట్రీట్మెంట్ ఆయుధాలు (టీజర్, స్టన్ గన్) వినియోగించే అంశంపై న్యాయపరంగా ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఆ మేరకు స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది.

More Stories
ఎయిర్ ప్యూరిఫైయర్స్పై జీఎస్టీ తగ్గింపుకు విముఖత
ఆరావళి పర్వతాల్లో మైనింగ్ నిషేధం
కేరళలో 24, ఛత్తీస్గఢ్లో 27, ఎంపీలో 42 లక్షల ఓట్ల తొలగింపు