
ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ లేఖలు వ్రాసిన వారిలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన నంద్యాల లోక్ సభ సభ్యుడు పీ.బ్రహ్మానంద రెడ్డి, శాసన సభ్యులు హఫీస్ ఖాన్ (కర్నూలు), డాక్టర్ సుధాకర్ (కోడుమూరు), శిల్పా రవిచంద్రా రెడ్డి (నంద్యాల), కే శ్రీదేవి (పత్తికొండ), కాటసాని రాంభూపాల రెడ్డి (పాణ్యం), కడప జిల్లాకు చెందిన కే.శివప్రసాద్ రెడ్డి (ప్రొద్దటూరు), ఎస్ రఘురామిరెడ్డి (మైదుకూరు), సీమ ప్రాంతానికి చెందిన శాసనమండలి సభ్యుడు రమేష్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) తిరుపాల్ రెడ్డి, ప్రొద్దటూరు మాజీ శాసన సభ్యుడు ఎన్.వరదరాజులు రెడ్డి ఉన్నారు.
లేఖల ద్వారానే కాకుండా రాజకీయాలకు అతీతంగా రాయలసీమ ప్రాంత్రానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు తమ డిమాండ్ కు మద్దతు ప్రకటించారని కూడా దశరధ రామిరెడ్డి తెలిపారు. ఇక ప్రజా ప్రతినిధులు సంతకాలు చేసిన లేఖలతో పాటు తెలుగు రాష్ట్రాల అవసరాలకు కృష్ణా జలాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న ప్రాంతంలోనే కృష్ణా జలాల నిర్వహణను పర్యవేక్షించే సాధికార బోర్డు ఉండాలని వివరిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి లేఖను పంపినట్టు దశరధ రామిరెడ్డి తెలిపారు.
More Stories
పొట్టి శ్రీరాములు పేరు మార్పుపై బిజెపి నిరసన
దళారుల చేతుల్లో మోసపోతున్న తిరుమల భక్తులు
జగన్ `అప్పుల రెడ్డి’ వైద్య విద్యను భ్రష్టు పట్టించారు