ఆన్‌లైన్‌లోనే ఎస్‌బీఐ హోమ్ లోన్

బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లకుండానే, ఆన్‌లైన్‌లోనే సులభంగా గృహావసరాల కోసం రుణాలు పొందే సదుపాయాన్ని దేశంలో దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా  (ఎస్‌బీఐ) కల్పిస్తున్నది.  యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు, సత్వరం ఆమోదం కూడా పొందే సౌకర్యం కల్పిస్తుంది. 

ఎస్‌బీఐ యోనో ద్వారా హోమ్ లోన్ పొందాలని భావించే వారు ఎప్పుడైనా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 24 గంటలూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కోఅప్లికెంట్ అడిషన్ ఆప్షన్ కూడా ఉంది. ఎస్‌బీఐ ఆమోదించిన ఆస్తులలో నచ్చిన ఇల్లు కొనొచ్చు. పత్రాల సమర్పణకు అపాయింట్‌మెంట్ కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ విధంగా హోమ్ రుణ ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంటుంది.

ఎస్‌బీఐ యోనో ద్వారా లోన్ పొందాలని భావిస్తే ముందుగా తమ ఫోన్‌లో ఎస్‌బీఐ యోనో యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని, నమోదు చేసుకోవాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. అయితే ఎస్‌బీఐ యోనో యాప్ వాడాలంటే కచ్చితంగా నమోదైన మొబైల్ నెంబర్ ఉండాల్సిందే. 

ఎస్‌బీఐ యోనో యాప్ కలిగిన వారు లాగిన్ అవ్వాలి. తర్వాత బెస్ట్ ఆఫర్స్‌లోకి వెళ్లాలి. తర్వాత ఎస్‌బీఐ రియల్టీ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత హోమ్ లోన్స్ అప్లైపై క్లిక్ చేయాలి. తర్వాత రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. లేదంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కూడా లోన్ కోసం దరఖాస్తు చేయొచ్చు. కాగా గృహావసరాల రుణాలపై వడ్డీ రేటు 8.75 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. జీరో ప్రాసెసింగ్ ఫీజు సదుపాయం కూడా పొందొచ్చు.