
కేరళలోని ప్రసిద్ధ గురువయూర్ ఆలయంలో డిసెంబర్ 26న ఓ వివాహ వేడుక జరిగింది. కాసేపట్లో పెళ్లి తంతు మొదలవుతుందనగా.. వధువు అందంగా ముస్తాబై మండపానికి చేరుకుంది. అక్కడ డ్రమ్స్ వాయిస్తున్న బ్యాండ్ బృందాన్ని చూసింది. అంతే పెళ్లి పీటలెక్కాల్సిన వధువు బ్యాండ్ బృందం దగ్గరకు పరుగెత్తింది. వారితో చేరి తాను ఓ ఛెండాను మెడలో వేసుకుని వాయించడం మొదలుపెట్టింది. ఆ వధువు ఛెండాను ఎంతో ఉత్సాహంగా వాయిస్తూ అందరినీ ఆకట్టుకుంది. మధ్యలో వరుడు, వధువు తండ్రి కూడా జత కలిసారు. వారుకూడా బ్యాండ్ బృందంలోకి వచ్చి సందడి చేశారు.
More Stories
VIDEO: కాశ్మీర్ పండిట్లను శరణార్థులుగా మార్చేసిన కాళరాత్రి
దశాబ్దాలుగా హిందూ ఎమ్మెల్యే లేని ఏపీ నియోజకవర్గాలు
VIDEO: నాస్తికవాదం ముసుగులో సామాజిక విద్వేషం