శత్రువులు బెదిరింపులు కొనసాగితే ప్రభుత్వం అణ్వాయుధాలతో ఎదుర్కొంటామని ప్రకటించాడు. ఈ క్రమంలో భద్రతా మండలి సమావేశం కాగా, భారత్ తరఫున శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ క్షిపణులతో డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రాంతంతో పాటు వెలుపల శాంతి, భద్రతను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.
అణు, క్షిపణి సాంకేతికత విస్తరణ ఆందోళన కలిగించే విషయమని ఆమె చెప్పారు. ఎందుకంటే అవి దేశంలో శాంతిభద్రతలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం, భద్రతా మండలి ఐక్యంగా ఉండగలవని ఆశిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రయోగాలు భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించినట్లు అని ఆమె తెలిపారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి, భద్రత దిశగా అణు నిరాయుధీకరణకు భారత్ నిరంతర మద్దతును అందిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

More Stories
పాకిస్థాన్ తొలి సిడిఎఫ్ గా అసిమ్ మునీర్
రూ.500తో మహిళలకు 40 నిమిషాల ఆన్లైన్ ఉగ్రవాద శిక్షణ
ఉక్రెయిన్ శాంతి ప్రణాళికపై క్రెమ్లిన్ అభ్యంతరాలు