జాతీయగీతం జనగణమనకు, వందేమాతరం గేయానికి సమాన హోదా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జనగణమనకు సమానమైన హోదాను వందేమాతరం గేయానికి కూడా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా కేంద్రం ఈ విధంగా స్పందించింది.
దేశంలోని ప్రతి పౌరుడు ఈ రెండింటికి సమాన గౌరవం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ గీతం జన గణ మన లాగే వందేమాతరం గేయానికీ సముచిత గౌరవం, సమాన హోదా కల్పించాలని కోరుతూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
భారత స్వాతంత్య్ర పోరాటంలో ‘వందేమాతరం’ పాట కీలక పాత్ర పోషించిందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి సమాధానం చెప్పాలని కోరుతూ కేంద్ర హోం, విద్యా, సాంస్కృతిక, న్యాయ మంత్రిత్వ శాఖలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన హోం మంత్రిత్వ శాఖ.. జాతీయగీతం, జాతీయగేయం రెండూ వాటి స్వంత పవిత్రతను కలిగి ఉన్నాయని, ఈ రెండూ సమాన గౌరవానికి అర్హమైనవని నొక్కి చెప్పింది. పౌరులంతా ఈ రెండింటికీ సమాన గౌరవం ఇవ్వాలని తెలిపింది.

More Stories
ఢిల్లీలో వాయు కాలుష్యం.. 75 శాతం కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు
న్యాయవాదులకు దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయలేవు
2,790 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా