
ఢిల్లీకి చెందిన స్వతంత్ర పరిశోధనా సంస్థ ప్రసీసీ (పిఆర్ఎసిసిఐఎస్)కు చెందిన సజ్జన్ కుమార్, ఫీల్డ్‌వర్క్ ఓరియెంటెడ్ రీసెర్చ్‌లో ప్రత్యేకత కలిగి, గుజరాత్ మొత్తం మీద విస్తృతమైన ప్రీ-పోల్ గ్రౌండ్ సర్వేను నిర్వహించి, రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
దీనికి విరుద్ధంగా, రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ జరుపుతుప్పటికీ, కాంగ్రెస్ కూలబడిపోతుందని భావిస్తున్నారు. ఆప్ కు అనుకూల పవనాలు కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీస్తాయని ఆయన అంచనా వేశారు.
2017లో, బిజెపి 100 కంటే తక్కువ సీట్లతో గెలుపొందింది, ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకుంది. తీవ్రమైన పోటీ ఎదురైనా తన సుడిగాలి ప్రచారం, అలసిపోని ఎన్నికల ప్రచారం ద్వారా గుజరాత్లో బిజెపిని ప్రధాన మంత్రి మోదీ సురక్షిత తీరాలకు చేర్చారని చెప్పవచ్చు. ఈసారి, 182 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో బిజెపికి 120 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని కుమార్ సర్వే ఫలితాలు చూపిస్తున్నాయి.
“2017లో గత సారి కంటే ఈసారి బిజెపి మెరుగ్గా పని చేస్తుంది, ఎందుకంటే అనేక అంశాలు పార్టీకి సహాయపడతాయి. మా సర్వే ప్రకారం, మేము బిజెపికి 120 సీట్లకు పైగా ఇస్తున్నాము. ప్రాథమికంగా గతసారి తీవ్ర ప్రతిఘటన ఇచ్చినకుల ఆధారిత గుర్తింపు రాజకీయ ఉద్యమ ప్రభావం ఇప్పుడు లేదు, ”అని కుమార్ చెప్పారు.
గుజరాత్లో కాంగ్రెస్‌కు ఈసారి ఎక్కువ ఆశలు లేవని తేల్చిచెప్పేందుకు కుమార్ తన ప్రీ-పోల్ సర్వేను ప్రస్తావించారు. గత సారి బిజెపి చేతిలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చాలా దగ్గరగా వచ్చినా అధికారంలోకి రాలేక పోవడంతో ఓటమి భావం కారణంగా అప్పటి నుండి ప్రజల మద్దతు తగ్గింది.
బిజెపిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌కు స్థానికంగా, జాతీయంగా సమర్ధవంతమైన నాయకత్వం లేదని సజ్జన్ కుమార్ భావిస్తున్నారు.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్‌కు 50 కంటే తక్కువ సీట్లు వస్తాయని ప్రాసిస్ సర్వే అంచనా వేసింది. 40 నుండి 50 మధ్య సీట్లతో కాంగ్రెస్ స్థిరపడే అవకాశం ఉంది.
పాటిదార్ ల మద్దతు
“సాధారణ సెంటిమెంట్: ‘మోదీ జీ వస్తారు, అంతా బాగానే ఉంటుంది’. ప్రధాని మోదీ చరిష్మా అసమానమైనదని, అటువంటి పరిస్థితి కాంగ్రెస్, ఆప్‌లకు లేకపోవడం ప్రధాన సవాల్ అని కుమార్ చెప్పారు.
24 సంవత్సరాలలో పార్టీ అత్యున్నత పదవిని ఆక్రమించిన మొదటి గాంధీయేతర నాయకుడు, కొత్త పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి హిమాచల్ ప్రదేశ్‌తో పాటు గుజరాత్ కూడా మొదటి ప్రధాన పరీక్ష అవుతుంది. అయితే గుజరాత్ లో కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం లేకపోవడం, గత పదేళ్లలో పలువురు కీలక నాయకులు పార్టీని వదిలి పెట్టడంతో కుదేలై ఉంది.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు