
తమిళనాడులో 50 చోట్ల ఆర్ఎస్ఎస్ తల24 పెట్టిన కవాతుకు ఈ నెల 6న అనుమతి ఇవ్వమని రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర పోలీసులు మాత్రం మూడు చోట్ల మాత్రమే అనుమతి ఇచ్చారు. మరో 23 చోట్ల బహిరంగ మైదానంలో కాకుండా హల్ లలో నిర్వహిస్తే అనుమతి ఇస్తామని తెలిపారు. ఇక మిగిలిన 24 చోట్ల అసలు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు.
దానితో మిగిలిన చోట్ల ఎందుకు అనుమతి ఇవ్వలేదో హోమ్ శాఖ నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. హోంశాఖ నివేదిక పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మద్రాసు హైకోర్టు పేర్కొంది.
రాష్ట్రంలో అక్టోబరు 2వ తేది జరుపతలపెట్టిన ఆర్‌ఎస్ఎస్ కవాతుకు పోలీసులు అనుమతించక పోవడాన్ని ఖండిస్తూ సుమారు 50కి పైగా పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వాటిని విచారించిన న్యాయస్థానం, ఈ నెల 6వ తేది కవాతుకు నిబంధనలతో కూడిన అనుమతులివ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో, ఈ పిటిషన్ విచారణ మళ్లీ బుధవారం విచారణకు రాగా పిటిషన్‌దారుల తరఫున హాజరైన న్యాయవాది, రాష్ట్రవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ప్రదర్శన నిర్వహించాలని దరఖాస్తు చేసుకోగా, కడలూరు, పెరంబలూరు, కళ్లకుర్చి ప్రాంతాల్లో మాత్రమే అనుమతించారని, మిగిలిన ప్రాంతాల అనుమతికి హోంశాఖ హెచ్చరికలున్నాయని పోలీసులు చెప్పినట్టు తెలిపారు.
ఈ విషయమై ఎందుకు అనుమతివ్వలేదని న్యాయమూర్తి ఇళందిరైయన్ పోలీసులను ప్రశ్నించగా, ఆర్ఎస్ఎస్ కవాతుకు అనుమతివ్వాలని సెప్టెంబరు 30వ తేది న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసిందని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా ఉండడంతో మూడు ప్రాంతాల్లో మాత్రమే అనుమతించినట్లు పేర్కొన్నారు. అందుకు నిఘా వర్గాల నివేదికలు సహితం కారణంగా పేర్కొన్నారు.
అందుకు స్పందించిన న్యాయమూర్తి, హోంశాఖ నివేదిక పరిశీలించిన తర్వాత మిగిలిన 47 ప్రాంతాల్లో ప్రదర్శనకు అనుమతించాలా, వద్దా అని వెల్లడిస్తామంటూ, తదుపరి విచారణ ఈ నెల 4వ తేదీకి వాయిదా వేశారు.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా