భారీగా తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు

భారీగా తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు
వాణిజ్య  ఎల్‌పీజీ   సిలిండర్‌ ధరను రూ.115.50 మేరకు భారీగా చమురు కంపెనీలు తగ్గించాయి.  గృహ వినియోగ సిలిండర్ల ధరలలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. తగ్గిన కమర్షియల్‌  ఎల్‌పీజీ సిలిండర్‌ ధర నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. 19 కిలోల ఇండేన్ ఎల్‌పీజీ సిలిండర్ పాత ధర కొత్త ధర రూ.1859  కాగా  ప్రస్తుతం రూ.115.50 తగ్గించడంతో 1744 రూపాయలకు చేరుకుంది.
గ్యాస్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పులు చేస్తాయి.  కమర్షియల్ సిలిండర్లను హోటళ్లు, ఫుడ్ షాపుల్లో ఉపయోగిస్తారు. దీంతో వ్యాపారులకు పెద్ద ఊరట లభించనుంది. వాణిజ్య గ్యాస్ ధరలు తగ్గించడం ఇది వరుసగా ఆరో నెల. అక్టోబర్ 1న వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.25.5 తగ్గించిన విషయం తెలిసిందే. 
 
ఇక తగ్గినా ధరలతో ఢిల్లీ లో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.115.50 తగ్గింది. దీనితో రూ.1744కు దిగొచ్చింది. అంతకుముందు రూ.1859గా ఉంది.  అదే కలకత్తా లో అయితే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1959 నుంచి 1846 రూపాయలకు వచ్చేసింది. చెన్నైలో రూ.2009.50 వద్ద వున్నా సిలిండర్ ఇప్పుడు రూ.1893కు చేరింది. అదే ముంబయిలో చూస్తే రూ.1696 రూపాయలుగా వుంది.