
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి శశిథరూర్‌పై ఘన విజయం సాధించిన మల్లిఖార్జున్ ఖర్గే ఈ నెల 26న పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎంపీ రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాకు వెల్లడించారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈ నెల 17న పోలింగ్ జరిగింది. 24 ఏళ్ల తర్వాత జరిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో శశి థరూర్‌ను ఓడించి ఖర్గే గాంధీయేతర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఖర్గే వయసు 80 ఏళ్లు. కర్ణాటకలోని బీదర్ జిల్లా భల్కి తాలూకా వరావట్టి గ్రామంలో (అప్పట్లో నిజాం సంస్థానం) 1942లో ఆయన జన్మించారు. ఆయనకు భార్య రాధా బాయి, ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఖర్గే బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు.
ఢిల్లీలో బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 9,385 ఓట్లు పోలవగా అందులో 7,897 ఓట్లు ఖర్గేకు పడ్డాయి. శశిథరూర్‌కు కేవలం 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో 416 ఓట్లు చెల్లకుండా పోయాయి. దాంతో ఖర్గే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఖర్ తమ పార్టీలో చిన్న, పెద్ద అనే తారతమ్యాలేమీ ఉండవని స్పష్టం చేశారు. అందరం కలిసికట్టుగా కార్యకర్తల్లా పనిచేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి చేస్తున్న ఫాసిస్ట్ పార్టీలకు వ్యతిరేకంగా తామంతా కలిసికట్టుగా పోరాడుతామని ఆయన చెప్పారు.
ఉత్తరప్రదేశ్ లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపణ
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ లో రిగ్గింగ్ జరిగిందంటూ ఆ పార్టీ నేత, అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగా చాలా అవకతవకలు జరిగాయని చెప్పారు. ఓట్ల లెక్కింపులో యూపీ ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మిస్త్రీని కోరారు. ఈ విషయంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు శశిథరూర్ తెలిపారు.
పోలింగ్ రోజు తెలంగాణలోనూ తీవ్రమైన సమస్యలు తలెత్తాయని థరూర్ బృందం ఇసికి లేఖ రాసింది. థరూర్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సల్మాన్ సోజ్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల అథార్టీ విచారణ జరుపుతామని ఇచ్చిందని ట్వీటర్ వేదికగా తెలిపారు. కాగా సోజ్ ఇసికి రాసిన లేఖ లీక్ అవడంపై థరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత విషయం అవడం దురదృష్టకరమని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పార్టీ బలోపేతానికి జరిగాయని, విడదీయడానికి కాదని కేరళ ఎంపి థరూర్ వ్యాఖ్యానించారు.
ఖర్గేకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గేకు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష ఫలితాలు వెలువడిన అనంతరం రాజాజీ మార్గ్ లోని ఖర్గే ఇంటికి వెళ్లిన సోనియా ఆయనకు విషెస్ చెప్పారు.
More Stories
భారత దేశ స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర
ట్రంప్ హెచ్చరికతో బందీలను విడుదలహమాస్ అంగీకారం
అవసరమైతే ఏ సరిహద్దునైనా భారత్ దాటుతుంది