బ్రిటన్‌లోని చైనా ఎంబసీ ఎదుట నిరసన

బ్రిటన్‌లోని చైనా ఎంబసీ ఎదుట నిరసన
బ్రిటన్‌లోని చైనా ఎంబసీ ఎదుట కొందరు నిరసనకు దిగారు. వీరిలో నుంచి ఒక ప్రదర్శనకారుడిని పక్కకు తీసుకెళ్లిన ఎంబసీ రక్షణ సిబ్బంది. . ఆయనను మూకుమ్మడిగా చితకబాదారు. ఈ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఈ దాడిపై విచారణకు ఆదేశించాలని బ్రిటన్‌ ఎంపీ ఒకరు కోరగా, ఇప్పటికే అక్కడి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. చైనా ఎంబసీ ఎదుట శాంతియుత ప్రదర్శన చేపట్టిన వారిని హాంకాంగ్‌కు చెందినవారుగా భావిస్తున్నారు.
 
బలప్రయోగం చేసైనా తైవాన్‌ను దారికి తెచ్చుకుంటామని చైనాచైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన   ప్రకటనకు నిరసనగా బ్రిటన్‌ మాంచెస్టర్‌లోని చైనా ఎంబసీ ఎదుట పలువురు ఆందోళన చేపట్టారు. ఇంతలో ఎంబసీ సిబ్బంది ఒక ప్రదర్శనకారుడిని పక్కకు తీసుకెళ్లి దారుణంగా చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో బ్రిటన్‌ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది.
 
ప్రదర్శనకారుడిపై దాడి చేయడంపై బ్రిటన్‌ ఎంపీ సర్‌ ఇయాన్‌ డంకన్‌ స్మిత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆందోళన కలిగించే విషయమన్న ఆయన, అత్యవసరంగా పరిశీలించాలని హోం సెక్రటరీ సెయెల్లా బ్రేవర్‌మాన్‌ను కోరారు. చైనా రాయబారి నుంచి ప్రభుత్వం క్షమాపణలు కోరాలని, బాధ్యులను చైనాకు పంపించే ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.