
హిందూ ధర్మం కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనేందుకు తన భర్త, గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ సిద్ధంగా ఉన్నారని ఆయన సతీమణి ఉషాబాయి స్పష్టం చేశారు. ప్రస్తుతం పిడి చట్టం క్రింద అరెస్ట్ అయి రాజాసింగ్ జైలులో ఉన్న సమయంలో తమకు అండగా ఉన్న బీజేపీ కార్యకర్తలకు, అభిమానులకు, ధర్మ రక్షకులకు ఆమె ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలియజేశారు.
‘‘దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం కష్టపడి పనిచేసే రాజాసింగ్… అదే ధర్మం కోసం జైళ్లో ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ సమయంలో హిందూ సమాజం, బీజేపీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులంతా మాకు అండగా ఉంటూ ధైర్యాన్ని ఇచ్చారు” అంటూ ఆమె ఓ ప్రకటనకు విడుదల చేశారు.
“రాజాసింగ్, ఆయన కుటుంబం అనాథ కాదు. ఇంత పెద్ద హిందూ సమాజం మాకు అండగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజాసింగ్ పేరు చెప్పుకుంటూ కొందరు కుట్రలు చేస్తూ సొంత రాజకీయ లబ్ది కోసం ఆయనను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నారు. హిందుత్వం పేరుతో కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి వారిపట్ల పార్టీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులు జాగ్రత్తగా ఉండాలి” అంటూ ఆమె హెచ్చరించారు.
రాజాసింగ్ ధర్మం కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉండేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. ఆయనకు జైళ్లు, కేసులు కొత్త కాదని అంటూ రాజాసింగ్ క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త అని ఆమె తెలిపారు. ఆయన చేతిలో ఉండేది కమలం జెండానే.. ఆయనలో ప్రవహించేది కాషాయ రక్తమే అని ఆమె తేల్చి చెప్పారు.
ధర్మ రక్షణ కోసం రాజాసింగ్ ఎన్ని బాధలు, కష్టాలు భరించడానికైనా సిద్ధంగా ఉన్నారని చెబుతూ ఇలాంటి పరిస్థితుల్లో మనందరం సంఘటితంగాఉండాలని, ధర్మం పేరుతో కొందరు చేస్తున్న కుట్రలను తిప్పికొడదామని ఉషాబాయి పేర్కొన్నారు.
More Stories
ఆయుర్వేద పద్ధతులను, యోగాను అణచి వేసే కుట్ర
లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం