
పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ ‘రాజస్థాన్ రెగాలియా’ పేరుతో బంపర్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలోని రాజస్థాన్‌లోని అజ్మీర్, బికనీర్, జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్‌ను సందర్శించేలా ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ రూపొందించింది.
ఆయా ప్రాంతాల్లో ఉన్న చారిత్రక ప్రదేశాలను వీక్షించేందుకు ఏటా పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. దేశంలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో జైసల్మేర్ ఒకటి. ఈ నగరాన్ని థార్ ఎడారికి ప్రవేశ ద్వారం అని కూడా పిలుస్తుంటారు. ఈ ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ మొత్తం ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు కొనసాగనున్నది.
ప్యాకేజీ అంతా విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించింది. ప్యాకేజీ ఈ నెల అక్టోబర్ 19న కొచ్చి విమానాశ్రయం నుంచి ప్రారంభంకానున్నది. ప్రయాణంలో ఆహారం, పానియాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పర్యాటకులు తీసుకునే ఆహారం నుంచి బస చేసే హోటల్ వరకు అన్నీ ఏర్పాట్లను ఐఆర్‌సీటీసీ చేయనున్నది.
ఇక చార్జీల విషయానికి వస్తే, ప్యాకేజీలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.55,750 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.45,250, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.43,800 చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. పూర్తి వివరాల కోసం.. https://www. irctctourism.com/pacakage_ description?packageCode=SEA24 లో సంప్రదించాలని ఐఆర్‌సీటీసీ కోరింది.
More Stories
జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వంకు అప్పగింత
కేజ్రీవాల్ అధికారిక నివాసం `శీష్మహల్’ పై సివిసి దర్యాప్తు
తగ్గనున్న వంట నూనెల ధరలు