
సమాజంలోని వివిధ రంగాలలో ఆర్ఎస్ఎస్ ప్రేరణతో పని చేస్తున్న వివిధ సంస్థల ముఖ్య ఆఫీస్ బేరర్ల సమన్వయ సమావేశం (అఖిల్ భారతీయ సమన్వయ్ బైఠక్) సెప్టెంబర్, 10 నుండి 13 వరకు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.
సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ జాతీయ స్థాయి సమన్వయ సమావేశంలో సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ, మొత్తం ఐదుగురు సహ-సర్ కార్యవాహలు, ఇతర సంఘ్ ముఖ్య కార్యకర్తలు పాల్గొంటారని ఆయన చెప్పారు.
హిరానయ్‌మయ్ పాండ్యా, బి. సురేంద్రన్ (బిఎంఎస్), అలోక్ కుమార్, మిలింద్ పరాండే (వి హెచ్ పి), ఆశిష్ చౌహాన్, నిధి త్రిపాఠి (ఎబివిపి), జెపి నడ్డా, బిఎల్ సంతోష్ (బీజేపీ), దినేష్ కులకర్ణి (బికెఎస్), రామకృష్ణారావు , గోవింద్ మొహంతి (విద్యాభారతి), వందనియ శాంతక్క, అన్నదానం సీతక్క (బిఎస్ఎస్), రామచంద్ర ఖరాడి, అతుల్ జోగి (వనవాసి కళ్యాణ్ ఆశ్రమం)లతో సహా మొత్తం 36 సంస్థల నుండి ప్రతినిధులు పాల్గొంటారని ఆయన వివరించారు.
ఈ సంస్థలు సమాజంలోని వివిధ రంగాలలో జాతీయవాద భావనతో పనిచేస్తాయని చెబుతూ ఈ సమావేశంలో పాల్గొనేవారు తమ పని గురించి వివరించి, తమ విజయాల గురించి ప్రదర్శనలు ఇస్తారని అంబేకర్ తెలిపారు. విద్య, మేధావులు, ఆర్థిక వ్యవస్థ, సేవా, జాతీయ భద్రత మొదలైన సమస్యలపై చాలా చురుకుగా పని చేసే ఈ సంస్థలు సంబంధిత కార్యకలాపాలు, సమస్యలను చర్చిస్తాయని పేర్కొన్నారు.
ఈ సంస్థలలో క్రియాశీలకంగా ఉన్న స్వయంసేవకులతో ఆర్ఎస్ఎస్ సమన్వయం చేస్తుందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పర్యావరణం, కుటుంబం (పరివార్ ప్రబోధన్), సామాజిక సమరస్తాకు సంబంధించిన సమన్వయ కార్యకలాపాల గురించి కూడా చర్చించనున్నారని వివరించారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు