
భారతదేశానికి చెందిన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అదానీ సంపద $ 137.4 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి రికార్డు సృష్టించారు. అదానీ ఎంటర్ప్రైజెస్ 31 మార్చి 2021 నాటికి 5.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.
ఆదానీ ఎంటర్ప్రైజెస్ స్థాపించకముందు అదానీ ముంబైలో వజ్రాల వ్యాపారి. అదానీ గ్రూప్ భారత్‌లో అతి పెద్ద థర్మల్ బొగ్గు ఉత్పత్తిదారు మాత్రమే కాదు, అతిపెద్ద బొగ్గు ట్రేడర్ కూడా. చైనాకు చెందిన జాక్ మా, భారతదేశానికి చెందిన ముఖేష్ అంబానీ లతో పాటు ఆసియాలో ఇప్పటివరకు ఎవ్వరు ఈ స్థానాలకు ఎప్పుడూ చేరుకోలేదు.
ఇక మూడో స్థానంలో అదానీ ఉండగా, మొదటి రెండు స్థానాల్లో టెస్లా మోటర్స్ సీఈవో ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు. ప్రసిద్ధ ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ ఎల్విఎంహెచ్ మోయెట్ హెన్నెస్సీ లూయిస్ విట్టన్ యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచిన అదానీ సంపద $ 137.4 బిలియన్ల డాలర్లతో దూసుకుపోతున్నారు.
ఇక మొదటి స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ నికర సంపద 251 బిలియన్ డాలర్లు. రెండో స్థానంలో నిలిచిన జెఫ్ బెజోస్ నికర విలువ 153 బిలియన్ డాలర్లు. నాలుగో స్థానానికి పడిపోయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ నికర విలువ 1.37 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక భారతదేశానికి చెందిన ముఖేష్ అంబానీ ఈ జాబితాలో టాప్ 10లో ఉన్నారు. అతని సంపద 91.9 బిలియన్ డాలర్లు.
More Stories
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ