
మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో వీడియో తీసి అరెస్ట్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. నుపూర్ శర్మఉదంతం అనుభవంతో రాజాసింగ్‌పై తక్షణం చర్యలు చేపట్టింది. దీంతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.
రాజాసింగ్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో పార్టీ ఈనిర్ణయం తీసుకుంది. శాసనసభాపక్ష నేత పదవి నుంచి కూడా తొలగించింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేను ఆదేశించింది.
కాగా రాజాసింగ్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. ఎమ్మెల్యే విడుదల చేసిన వీడియోపై రాత్రంతా మైనారిటీలు ఆందోళనలు నిర్వహించారు. దీంతో యూట్యూబ్ నుంచి వీడియోను పోలీసులు తొలలగించారు.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా రాజాసింగ్‌పై పలు రాష్ట్రాల్లో కేసు నమోదైంది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ పది రోజులు గడువిచ్చింది. సెప్టెంబర్ 2 లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.
More Stories
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం