సంచార జాతులు తల్చుకుంటే రాజ్యాలే మారతాయి

సంచార జాతులు తల్చుకుంటే క రాజ్యాలే మారిపోతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకాలను నోచుకోని సంచార జాతులకు కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. గాజులమ్మే పూసలు సహా సంచార జాతులన్నీ ఇంటింటికీ తిరిగి కేసీఆర్ సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని వివరించి గద్దె దించాలని కోరారు. 
 
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం చీటకోడూరు గ్రామంలోకి ప్రవేశించిన సంజయ్ కు స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు బోనమెత్తి కోలాటాలు ఆడారు. డప్పు వాయిద్యాల నడుమ కళాకారులు డ్యాన్సులు వేస్తూ ఆకట్టుకున్నారు. అనంతరం సంచార జాతులతో కలిసి నిర్వహించిన రచ్చబండలో. తమను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చడం లేదుని, ఏంబీసీ కార్పొరేషన్ నుండి లబ్ది పొందే కులాల జాబితాలో కూడా లేమని వాపోయారు. 
 
సంచార జాతులకు కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి వచ్చే పథకాలకు అర్హత లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణలో సంచార జాతుల జనాభా 30 లక్షలు ఉన్నప్పటికీ పాలకులకు మీపై దయలేదని, కెసిఆర్ కు బెల్టుషాపులు తప్ప, మీ బాధలు పట్టవని సంజయ్ ధ్వజమెత్తారు.
గాజులమ్మే మీతో సహా సంచార జాతులన్నీ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించండని పిలుపిచ్చారు.   కులవృత్తులను కేసీఆర్ నిర్వీర్యం చేసాడని విమర్శించారు.
 పాదయాత్రలో భాగంగా జనగాం శివారు నుండి చీటకొడూరు గ్రామంలోకి ప్రవేశిస్తున్న సంజయ్ అక్కడున్న దారిపై నీరు ప్రవహిస్తుండటంతో ఆ నీటిలో నడుచుకుంటూనే చీటకోడూరు గ్రామంలోకి అడుగుపెట్టారు.  భారీ వర్షం పడితే 20 గ్రామాలకు కనెక్టివిటీ తెగిపోతోందని ఈ సందర్భంగా గ్రామస్థులు వాపోయారు.
ఈ రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని ఏళ్ల తరబడి కోరుతున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని చెబుతూ  మీకు న్యాయం జరగాలంటే… బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనని సంజయ్ స్పష్టం చేశారు.