స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ పోలీసుల అప్రమత్తం

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ పోలీసుల అప్రమత్తం
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధాని పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్న ఎర్రకోట ప్రవేశ ద్వారం వద్ద బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఫేషియల్‌ రికగౖుెషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) కెమెరాలనూ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకోట వద్దకు దాదాపు ఏడు వేల మంది ఆహ్వానితులు రానున్నారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్మారక చిహుం చుట్టూ 10 వేల మంది పోలీసులను మోహరించనున్నారు. వైమానిక ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఏవైనా బెదిరింపులను ఎదుర్కోవటానికి తగిన ఏర్పాట్లను చేశారు.
ఎర్రకోట చుట్టూ ఐదు కిలోమీటర్ల ప్రాంతం త్రివర్ణపతాకాన్ని ఎగురవేసే వరకు”నో కైట్‌ ఫ్లయింగ్‌ జోన్‌”గా గుర్తించారు. రక్షణ పరిశోధక అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), ఇతర భద్రతా ఏజెన్సీల నుంచి యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు.
” ఎర్రకోట చుట్టూ హై రిజల్యూషన్‌ సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేశాం. వాటి ఫుటేజీని 24 గంటలు పరిశీలిస్తున్నాం. ఈసారి ఆహ్వానితుల సంఖ్య 7000కి పెరిగింది” అనిసీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వీవీఐపీలు వచ్చే మార్గంలో దాదాపుగా వెయ్యి హైస్పెసిఫికేషన్‌ కెమెరాలను అమర్చారు.
400కి పైగా కైట్‌ కేచర్స్‌ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. లంచ్‌ బాక్సులు, వాటర్‌ బాటిళ్లు, రిమోట్‌ కంట్రోల్డ్‌ కార్‌ కీలు, సిగరెట్‌ లైటర్లు, బ్రీఫ్‌ కేసులు, హ్యాండ్‌ బ్యాగులు, కెమెరాలు, బైనాక్యులర్లు, గొడుగులు ఇలాంటి వస్తువులు ఎర్రకోట ప్రాంగణంలోకి అనుమతించబోమని చెప్పారు.
ఢిల్లీలో ఇప్పటికే 144 సెక్షన్‌ను అమలులోకి తెచ్చినట్టు శాంతి భద్రతల విభాగం ప్రత్యేక కమిషనర్‌ దేవేంద్ర పాఠక్‌ తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఎర్రకోటలో కార్యక్రమం ముగిసే వరకు ఎవరైనా గాలిపటాలు, బెలూన్లు ఎగురవేస్తే శిక్షించబడతారని చెప్పారు.
ఆనంద్‌ విహార్‌ అంతర్‌రాష్ట్ర బస్‌ టెర్మినల్‌ సమీపంలో 2,200 లైవ్‌ కాట్రిడ్జ్‌లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకును విషయం విదితమే. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్టు చేశారు.  ఇటు నిఘా విభాగం హెచ్చరికలతో పోలీసులు పెట్రోలింగ్‌, తనిఖీలను ముమ్మరం చేశారు. హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, పార్కింగ్‌ స్థలాలు, రెస్టారెంట్లు తనిఖీలు చేస్తునాుమని, అద్దెదారుల, సేవకుల వెరిఫికేషన్‌ను నిర్వహిస్తున్నామని అధికారులు చెప్పారు.