బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ ఉప రాష్ట్రపతి అవ్వాలనుకున్నారని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుశీల్‌కుమార్ మోడి ఆరోపించారు. దీనికి బిజెపి సుముఖత వ్యక్తంచేయకపోవడంతోనే ఆయన ఎన్డీయే నుంచి వైదొలిగారని సుశీల్‌కుమార్ వెల్లడించారు.
తాను రాజ్యసభ ఎంపీగా పదివి చేపట్టక మునుపు, తాను బిహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిస్తున్న సమయంలో జేడీయు నాయకులు కొందరు తన వద్దకు వచ్చి ఒక ప్రతిపాదన పెట్టారని ఆయన తెలిపారు. నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతిగా ఢిల్లీ వెళ్లితే మీరు ముఖ్యమంత్రి అవుతారంటూ అదే జేడీయే నాయకులు ఒక పథకంతో తనను సంప్రదించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉప రాష్ట్రపతి పదవిని ఆశించి భంగపడిన నితీశ్ ఆగ్రహంతో బిజెపి కూటమిని వదిలేశారని విమర్శించారు. నితీశ్ ఆశయం నెరవేరకపోవడంతో ఎన్డీయే కూటమిని వీడి యుపిఎ కూటమితో జత కట్టారని పేర్కొన్నారు.
నితీష్ ఈ రోజు బీజేపీ ప్రజలను మోసం చేశారంటూ మండిపడ్డారు. బిహార్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని చూసి నమ్మి ఓటు వేస్తే ఇలా వెన్నుపోటు పొడిచే రాజకీయానికి తెరలేపారని మోదీ ఆరోపించారు. తాను ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌తో ఉన్న కొత్త బిహార్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూస్తానంటూ విమర్శలు ఎక్కుపెట్టారు.
కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో లోపే ఈ ప్రభుత్వం పడిపోతుందని సుశీల్ మోదీ స్పష్టం చేశారు. నితీష్ కుమార్ మహారాష్ట్రలా బిహార్ అవుతుందని భయపడ్డానని చెబుతున్నారని పేర్కొంటూ కానీ బీజేపీ ఏమీ శివసేనను విభజించడానికి ప్రయత్నించలేదని ఆయన చెప్పారు. అంతేకాదు లాలు ప్రసాద్ యాదవ్ అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకుని ఆర్జేడియూని చీల్చడానికి నితీష్ ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

More Stories
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
కొత్త సీజేఐ నియామకంపై కసరత్తు!
భారత అంతరిక్ష రంగం 2025లో అద్భుత పురోగతి