
రష్యా నుంచి ఎస్–400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేస్తున్న భారత్పై ట్రంప్ హయాం నుంచి ఆగ్రహంగా ఉన్న అమెరికా తాజాగా సానుకూల నిర్ణయం తీసుకుంది. కీలకమైన కౌంటరింగ్ అమెరికా అడ్వెర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్(కాట్సా) ఆంక్షల నుంచి మినహాయింపు నిచ్చింది.
రష్యా నుండి ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు విధించిన కౌంటరింగ్ అమెరికాస్ అడ్వైజరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్( సిఎఎటిఎస్ఎ) ఆంక్షల నుండి భారత్కు మినహాయింపునిస్తూ చేపట్టిన చట్ట సవరణను అమెరికా ప్రతినిధుల సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. నేషనల్ ఢిపెన్స్ అధరైజేషన్ యాక్ట్ (ఎన్డిఎఎ) పరిశీలనలో భాగంగా ఈ సవరణ చేపట్టగా.. ఆమోదం లభించింది.
చైనా వంటి దురాక్రణదారులను నిలువరించేందుకు భారత్కు ‘ఎస్–400’ఎంతో అవసరమని పేర్కొంది. కాట్సా నుంచి మినహాయింపు కల్పిస్తూ భారత్కు మద్దతుగా నిలిచేందుకు అధ్యక్షుడు బిడెన్ పరిపాలన తన అధికారాన్ని ఉపయోగించాలని కోరింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఇండో–అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రొ ఖన్నా సభలో ప్రవేశపెట్టారు.
ఎంతో ప్రాముఖ్యమున్న ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించడం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అమెరికా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ భారత ప్రభుత్వం 2018లో రష్యా నుంచి రూ.40 వేల కోట్ల విలువైన ఐదు ఎస్–400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
సిఎఎటిఎస్ఎ అనేది అమెరికాలో కఠినమైన చట్టం. రష్యా నుండి రక్షణ హార్డ్వేర్లను కొనుగోలు చేయకుండా దేశాలపై ఆంక్షలు విధించడానికి అమెరికా చేసిన చట్టం. 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్న తర్వాత.. అదేవిధంగా 2016 అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకు ప్రతిగా ఈచట్టాన్ని తీసుకువచ్చింది.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా డ్రోన్లు కూల్చేసిన పోలాండ్