
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు తొలిసారిగా ఆయన నాయకత్వం వహిస్తున్న వైసిపి రెండు రోజుల ప్లీనరీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. పార్టీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని, గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా ఉన్న మైదానంలో భారీ సన్నాహాలు జరిపారు.
ఇడుపుల పాయలో దిగవంత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయనాతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి ఇక్కడకు చేరుకొంటారు. ప్రాంగణంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జెండాను ఆవిష్కరించి లాంఛనంగా ప్లీనరీని ప్రారంభిస్తారు.
పభుత్వ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలైన మహిళాసాదికారిత, దిశచట్టం, విద్య, వైద్యం, నవరతాులు, పారదర్శకమైన పరిపాలన అనే ఐదు అంశాలపై తొలిరోజు చర్చించి తీర్మానాలు చేస్తారు. రెండో రోజున సామాజిక సాదికారిత, వ్యవసాయం, పారిశ్రామిక విధానం, ఎల్లో మీడియా దుష్టచతుష్టయం అనే అంశాలపై చర్చించి తీర్మానాలను చేయనున్నారు. చివరగా భారీ బహిరంగసభతో ప్లీనరీ ముగుస్తుందని నాయకులు ప్రకటించారు.
వైసిపి ఆవిర్భవించిన తరువాత జరుతును మూడవ ప్లీనరి ఇది. మొదటి ప్లీనరీని పార్టీ ఆవిర్భావ సంవత్సరం 2011లో నిర్వహించారు. రెండోసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మైదానంలో 2017లో నిర్వహించుకుంది. తాజా ప్లీనరీని భారీగా నిర్వహించేందుకు ఆ పార్టీ దాదాపుగా నెల రోజుల నుండి సన్నాహాలను ప్రారంభించింది.
ఈ ప్లీనరీకి మొదటి రోజున జరిగే ప్రతినిధుల సభకులక్షనుర మంది, రెండోరోజున జరిగే బహిరంగస భకు నాలుగు లక్షల మంది హాజరవుతారని నాయకులు చెబుతున్నారు. నాగార్జున యూనివర్శిటీ ఎదుట 40ఎకరాల మైదానంలో ఈ ప్లీనరీకి ఏర్పాట్లను చేశారు.
వర్షాకాలం కావడంతో ఎంతటి వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండదని, ఒక్కరు కూడా తడవకుండా టెంట్లనే ఏర్పాటు చేశామని నేతలు చెబుతున్నారు. గుంటూరు విజయవాడ నగరాల మద్య ఈ ప్లీనరీ జరుగుతుండటంతో ఆయానగరాలతో పాటు జాతీయ రహదారిపై వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పతాకాలను, నాయకుల ఫ్లెక్సీలను పెద్దఎత్తున ఏర్పాటు చేశారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు