దేశంలో వాణిజ్య వంట గ్యాస్ ధర శుక్రవారం తగ్గింది. జులై 1వ తేదీ శుక్రవారం నుంచి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.198 తగ్గింది. దేశ రాజధానిలో శుక్రవారం వాణిజ్య వంట గ్యాస్ ధర రూ.2021 అవుతోంది.
గతంలో 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2,219గా ఉంది. అంతకుముందు జూన్ 1న కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.135 తగ్గింది. ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చేలా రూ.198 తగ్గించినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని రిటైలర్లు తాజా నోటిఫికేషన్‌లో తెలిపారు.
కోల్‌కతాలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.182 తగ్గింది. మరోవైపు ముంబైలో రూ.190.50, చెన్నైలో రూ 187 తగ్గింది. హైదరాబాద్‌లో రూ.2426గా ఉన్న సిలిండర్ ధర రూ.2243కు చేరింది. హైదరాబాద్ లో ఒక సిలిండర్ పై ధర రూ.183.50 తగ్గింది.పెట్రోలియం కంపెనీ ఇండియన్ ఆయిల్ కూడా వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గించింది.

More Stories
విద్యార్థుల కోసం ‘జెన్-జెడ్’ పోస్టాఫీస్లు
అమెరికా ఆంక్షలతో చమురు అమ్మకాలు ఆపేసిన రిలయన్స్
అనిల్ అంబానీ రూ. 1,400 కోట్ల ఆస్తుల జప్తు