
ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జులై 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. జులై 19న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ, ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
అదే రోజున కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించి ఫలితం కూడా వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు కొనసాగుతోన్న విషయం విదితమే. 2017 ఆగస్టు 11వ తేదీన ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాబట్టి ఆయన పదవీకాలం ఆగష్టు 10తో పూర్తి కానున్నది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 233మంది రాజ్యసభ సభ్యులతో పాటు 12 మంది నామినేటెడ్ సభ్యులు, 543 మంది లోక్సభ ఎంపీలతో కలుపుకొని మొత్తం 788 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
More Stories
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు