కుంజియులర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

కుంజియులర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీరులో మంగళవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. షోపియాన్ జిల్లా కంజియులర్ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
 
హతులైన ఉగ్రవాదుల్లో ఒకరు జాన్ అహ్మద్ లోన్‌గా గుర్తించారు.కంజియులర్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే విశ్వసనీయ సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు కేంద్ర భద్రతా బలగాలతో కలిసి గాలింపు చేపట్టాయి. భద్రతా బలగాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపగా, జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు.
 
తీవ్రవాదులు సంచిరిస్తున్నారనే సమాచారం రావడంతో కుంజియర్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని ఐజి విజయ్ కుమార్ తెలిపారు.  సంఘటన స్థలంలో జవాన్లు ఉగ్రవాదుల కోసం బుధవారం కూడా గాలింపు కొనసాగిస్తున్నారు.
జాన్ మహ్మద్ జూన్ 2వ తేదీన కుల్గాం జిల్లాలో బ్యాంకు మేనేజరు విజయ్ కుమార్ ను హతమార్చిన కేసులో నిందితుడని కశ్మీర్ జోన్ ఐజీపీ బుధవారం ఉదయం చెప్పారు. మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు.