
అంతరాష్ట్ర మండలిని (ఐఎస్‌సి) కేంద్ర ప్రభుత్వం పునర్వస్థీకరించింది. మండలి ఛైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తారు. మండలిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరుగురు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈ పునర్వస్థీకరణ ప్రక్రియ గురించి సోమవారం అధికారిక ప్రకటన వెలువడింది.
దేశంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య సత్సబంధాల దిశలోని సహకార సమాఖ్య వ్యవస్థకు ఊతం కల్పిస్తూ ముందుకు సాగేందుకు ఈ అంతరాష్ట్ర మండలి ఏర్పాటు ప్రక్రియ చాలా కాలంగా ఉంది. ఇప్పుడు కౌన్సిల్ స్థాయి సంఘాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఛైర్మన్‌గా ఖరారు చేశారు.
అంతరాష్ట్ర మండలిలో సభ్యులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్ , వీరేంద్ర కుమార్, హర్దీప్ సింగ్ పూరి , నితిన్ గడ్కరి , ఎస్ జైశంకర్ , అర్జున్ ముండా, పియూష్ గోయల్ , ధర్మేంద్ర ప్రధాన్ , ప్రహ్లాద్ జోషీ, అశ్విని వైష్ణవ్ , గజేంద్ర సింగ్ షెకావత్, కిరెన్ రిజిజూ, భూపేంద్ర యాదవ్ ఉంటారు.
కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయం సామరస్యం దిశలో మండలి స్థాయి సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. అవసరం అయితే నిర్థిష్ట రంగాలకు చెందిన వారిని ఆహ్వానించి వారి నుంచి సమగ్ర అధ్యయనానికి వీలు కల్పిస్తారు. వివాదాస్పద అంశాలపై కేంద్రం రాష్ట్రాల మధ్య సవ్యమైన పరిష్కారానికి మండలి కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యతను తీసుకోవాలి.
స్టాండింగ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర, ఒడిషా, పంజాబ్, యుపి వంటి రాష్ట్రాల సిఎంలను కూడా సభ్యులుగా చేర్చారు. నదీ జలాలు, సరిహద్దు వివాదాలు , పోలీసు బలగాల తరలింపులు వంటి పలు కీలక అంశాలలో అంతరాష్ట్ర మండలి కీలక పాత్ర పోషిస్తోంది.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం