
పెట్రోల్, డీజిల్ ధరల రేట్ల తగ్గింపు విషయంలో కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ రేట్ల తగ్గింపు ఉపశమనం ఇస్తుందని భావిస్తున్నట్లు, ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంలోని అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్వీట్లో చేశారు.
దీని ఫలితంగా పెట్రోల్ రూ. 9.50 పైసలు, డీజిల్ రూ. 7 వరకు తగ్గడం హర్షణీయమని, నిత్యావసర ధరల పెరుగుదలకు ఇంధన రేట్లు కారణమని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో ఈ ధరలు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. మధ్య తరగతి ప్రజలకు కొంత స్వాంతన కలిగిస్తుందని భావిస్తున్నట్లు, పీఎం ఉజ్వల యోజన పథకంలో అందించే గ్యాస్ సిలిండర్లపై రూ · 200 తగ్గించడం పేదవారికి ఆర్థికంగా మేలు ఆయన చేకూరనుందని వెల్లడించారు.
కాగా, కేంద్ర ప్రభుత్వ బాటనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇంధన ధరలపై స్థానిక పన్నులు అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే అధికంగా ఉన్నాయని గుర్తు చేశారు. ధ్వంసమైన రోడ్ల విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
ప్రజల ప్రయాణం భారంగా మారి వాహనాలు మరమ్మత్తులకు లోనై అల్లాడిపోతున్నారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై రోడ్డు సెస్ పేరిట నుంచి ఏటా రూ. 600 కోట్లు వసూలు చేస్తోందని మండిపడ్డారు. అయినా.. రోడ్ల బాగు చేసే పరిస్థితి కనిపించడం లేదని, కనీసం పెట్రోల్, డీజిల్ పై స్థానిక పన్నులు తగ్గించి ఊరట కలిగించాలని ప్రజలు చేస్తున్న డిమాండ్ ను వైసీపీ సర్కార్ నెరవేర్చాలని కోరుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ