
విశాఖపట్నం పోర్టు అథారిటీ మరో అరుదైన రికార్డును సాధించింది. ఒకే రోజులో విశాఖపట్నం పోర్టులో అత్యధిక సరుకును హ్యాండిల్ చేసిన ఘనతను దక్కించుకుంది. ఈ నెల 19న 3,76,460 మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసి ఈ రికార్డును సాధించింది. నెల రోజుల వ్యవధిలో పోర్టు ఈ రికార్డును సాధించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
ఈ ఏడాది ఏప్రిల్ 26న ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 3,73,544 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసిన సంగతి తెలిసిందే. ఇన్నర్ హార్బర్, అవుటర్ హార్బర్, ఎస్‌పిఎంల నుంచి తాజాగా 3,76,460 మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేశారు. 19న పోర్టుకు వచ్చిన 22 నౌకల ద్వారా ఈ రికార్డు సాధించింది.
ఈ నెల 19న పోర్టుకు వచ్చిన 22 నౌకల ద్వారా ఈ సరుకును హ్యాండిల్ చేశారు. ప్రస్తుతం ఈ రికార్డులను అధిగమించి విశాఖపట్నం పోర్ట్ అధారిటీ నూతన రికార్డును నెలకొల్పడంతో పోర్టు సాధించిన ఈ ఘనత పట్ల చైర్మన్ కే.రామమోహనరావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘనతను సాధించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మేనేజర్ రత్న శేఖర్‌ను, ట్రాఫిక్ విభాగం సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించి పోర్టు అభివృద్ధికి నిరంతం కృషి చేయాలని అభిలషించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు