2వేలకు పైగా దెబ్బతిన్న రైల్వే వ్యాగన్ల మర్మత్తు 

గత నాలుగు నెలల్లో విద్యుత్‌ ప్లాంట్లకు బగ్గును తరలింపును వేగవంతం చేసేందుకు 2 వేలకు పైగా దెబ్బతిన్న వ్యాగన్‌లను భారత్‌ రైల్వే మరమ్మతులు చేపట్టింది. దీనికి గానూ  రూ 150 కోట్లను ఖర్చు చేసింది. దేశంలో విద్యుత్‌ కొరత నెలకొంటున్న సమయంలో ఈ పనులు జరుగుతున్నాయి. 
 
ఏప్రిల్‌ 28న, గరిష్ట డిమాండ్‌ రికార్డు స్థాయిలో 204.6 గిగా వాట్స్‌కు చేరుకోవడంతో.. 192.1 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరతను ఎదుర్కొంది. రైల్వే మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. జనవరిలో 9,982 అటువంటి వ్యాగన్‌లు దెబ్బతిన్నాయి. ఇది మే 2 నాటికి 7,803కి తగ్గాయి. 
 
మొత్తంగా ఈ నాలుగు నెలల కాలంలో 2,179 వ్యాగన్లకు మరమ్మతులు చేపట్టింది. ఈ వ్యాగన్‌ మరమ్మత్తులకు ఒక్కొక్క దానికి రూ. 5 నుండి 10 లక్షల మధ్య ఖర్చు అయ్యిందని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. గతంలో వ్యాగన్ల నుండి బగ్గు అన్‌లోడ్‌ మాన్యువల్‌గా జరిగేదని, కానీ ప్రైవేటు కాంట్రాక్టర్లు జెసిబితో తీస్తున్నారని పేర్కొన్నారు. 
 
దీని వల్ల దెబ్బతిన్న వ్యాగన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. డేటా ప్రకారం… జనవరి 1 నాటికి 9,982 వ్యాగన్లు దెబ్బతినగా. జనవరి 6 నాటికి వాటి సంఖ్య 10,687కు పెరిగింది. ఫిబ్రవరి 11న 7,267 ఉండగా.. మే 2 నాటికి 7,803కి పెరిగింది.