
వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనాతో ఏర్పడిన ప్రతిష్టంభన “మన దళాలు కీలకమైన ప్రదేశాలలో భౌతికంగా మోహరించి ఉన్నాయి. యథాతథ స్థితిలో ఎలాంటి మార్పును, భూభాగాన్ని కోల్పోవడాన్ని మనం అనుమతించబోము” అని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే స్పష్టం చేశారు.
పదవీ బాధ్యతలు స్వీకరించిన మరుసటిరోజు సైన్యం గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ఎదురు కాగల ముప్పు అంచనాలను మన దళాల మోహరింపును మారుస్తూ ఉంటామని చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలకు చర్చల ప్రక్రియ ఒక్కటే పరిష్కారం అని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు వెంబటి ఉద్రిక్తలను తగ్గించడం కోసం అవసరమైన అన్ని చర్యలను తీసుకొంటాము అని భరోసా ఇచ్చారు.
భారత సైన్యం విధి నిర్వహణ, కార్యకలాపాల్లో సమర్థతను పెంచేందుకు ప్రస్తుత సంస్కరణలు, పునర్నిర్మాణం, పరివర్తనలపై ప్రధానంగా దృష్టి పెడతానని ఆయన ఆదివారం చెప్పారు. సైన్యానికి దేశ నిర్మాణంలో గొప్ప కీర్తిప్రతిష్టలు ఉన్నాయని, దేశ రక్షణ కోసం కృషిని కొనసాగిస్తామని చెప్పారు.
సమకాలీన, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి కార్యాచరణ సంసిద్ధత కోసం ఉన్నత ప్రమాణాలకు భరోసా ఇవ్వడమే తన అత్యంత ప్రాధాన్యత అని పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితి వేగంగా మారుతోందని తెలిపారు. మనకు అనేక సవాళ్ళు ఉన్నాయని చెబుతూ అన్ని విభాగాలతో కలిసి ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండటం భారత సైన్యం కర్తవ్యమని తెలిపారు.
గతంలో సేవలందించిన ఆర్మీ చీఫ్‌లు చేసిన కృషిని కొనసాగిస్తానని చెప్పారు. “సామర్థ్య అభివృద్ధి, సేనల ఆధునీకరణకు సంబంధించి స్వదేశీకరణ, ఆత్మనిర్భర్త ప్రక్రియ ద్వారా కొత్త సాంకేతికతలను ఉపయోగించుకోవడమే నా ప్రయత్నం” అని ఆయన చెప్పారు.
భారత వాయు సేన, భారత నావికా దళాల చీఫ్‌లతో తనకు పరిచయం ఉందని పేర్కొంటూ త్రివిధ దళాల మధ్య సమన్వయం, సహకారం, ఉమ్మడితత్వాలకు ఇది నాంది అని చెప్పారు. త్రివిధ దళాలు కలిసికట్టుగా పని చేస్తామని, దేశ భధ్రత, రక్షణ కోసం కృషి చేస్తామని హామీ ఇస్తున్నానని స్పష్టం చేశారు.
భారత సైన్యానికి నాయకత్వం వహించే బాధ్యతను తనకు అప్పగించడం గర్వకారణమని తెలిపారు. దేశ భద్రత, సమగ్రతలను కాపాడటంలో భారత సైన్యానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని పేర్కొంటూ అదే విధంగా దేశ నిర్మాణం కోసం కూడా సైన్యం కృషి చేసిందని తెలిపారు.
కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి వచ్చిన మొదటి ఆర్మీ చీఫ్ కావడాన్ని ప్రసత్తవిస్తూ జనరల్ పాండే ఇలా అన్నారు: “భారత సైన్యంలోని వివిధ విభాగాలు, సేవల నుండి వచ్చిన అధికారులందరికీ కెరీర్ మరియు వృత్తిపరమైన వృద్ధికి సమాన అవకాశం లభిస్తుంది. సీనియర్ నాయకత్వ స్థానాల్లో, అధికారులందరూ శిక్షణ పొందారు. యుద్ధంకు సంబంధించిన అన్ని అంశాలపై దృష్టి సారిస్తారు”. ”
“భారత సైన్యానికి నాయకత్వం వహించమని నన్ను కోరడం నాకు గర్వకారణం. దేశపు భద్రత, సమగ్రతను కాపాడిన అద్భుతమైన గతం దీనికి ఉంది. అదే విధంగా, ఇది దేశ నిర్మాణానికి కూడా దోహదపడింది. భౌగోళిక రాజకీయ పరిస్థితి వేగంగా మారుతోంది. మన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. నా పూర్వీకులు చేసిన పనిని ముందుకు తీసుకెళ్లడమే నా ప్రయత్నం” అని చెప్పుకొచ్చారు.
జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే స్థానంలో జనరల్ మనోజ్ పాండే ఆర్మీ చీఫ్‌గా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీ చీఫ్ పదవీ కాలం మూడేళ్ళు లేదా వయసు 62 సంవత్సరాలు, ఈ రెండిటిలో ఏది ముందు అయితే, అప్పుడు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!