ఒవైసీకి బొట్టు పెట్టి ‘జై శ్రీరాం’ అన్పించే దమ్ముందా?

రంజాన్ ఇఫ్తార్ విందులో ఎంఐఎం  నేత అసదుద్దీన్ ఒవైసీ ఇచ్చిన టోపీ పెట్టుకుని అల్లాను స్మరించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్  సవాల్ విసిరారు.

 ‘‘నిన్న కేసీఆర్ ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీకి ఇఫ్తార్ విందు ఇచ్చి ఒవైసీ ఇచ్చిన టోపీ పెట్టుకుని అల్లాహో అక్బర్ అన్నవ్ కదా… మరి ఒవైసీ నుదుట బొట్టు పెట్టే దమ్ముందా? ఒవైసీ నోట ‘జై శ్రీరాం’ అన్పించే ధైర్యముందా?’’అని ప్రశ్నించారు. 

ప్రజా సంగ్రామం యాత్రలో భాగంగా  17వ రోజు శనివారం రాత్రి పెద్ద జెట్రం వద్ద గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుస్తూకొంటూ ఇఫ్తార్ విందుకు పోయి కేంద్రాన్ని, నరేంద్ర మోదీని తిట్టడం ఎందుకో? అంటూ నిలదీశారు. మోదీని తిడితే ఎంఐఎం చాలా హ్యాపీగా ఫీలవుతుందని, తద్వారా రంజాన్ గిఫ్ట్ ఇచ్చినట్లయితదని కేసీఆర్ ఆ పని చేసిండట అంటూ ఎద్దేవా చేశారు. 

దసరా, దీపావళి పండుగలకు, హనుమాన్, అయ్యప్ప దీక్షలప్పుడు ఒవైసీని ఎందుకు పిలవలేదు? అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు.నిత్యం రాముడిని, అమ్మవారిని తిడుతూ 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానన్న ఒవైసీకి ఇఫ్తార్ విందు ఇచ్చి అక్కడ నరేంద్ర మోదీని తిట్టడం సిగ్గు చేటు అంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 రాష్ట్రంలో మతం పేరిట నీచమైన రాజకీయాలు చేస్తోంది కేసీఆరే అని మండిపడుతూ రంజాన్ సందర్భంగా చేసే హలీం, హరీష్ వంటకాల్లో వేరేది కలుపుతారని ఆరోపించారు. థూ.. హలీం ను ఎవరూ తినొద్దు అని స్పష్టం చేశారు. 

ధరణి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో బండి స్పందించారు. ధరణి పోర్టల్ కేసీఆర్ కుటుంబానికి తప్ప సామాన్యులకు ఏ మాత్రం ఉపయోగపడలేదని స్పష్టం చేశారు.

ఇనాం, పోరంబోకు భూములను కూడా ధరణి పేరుతో కేసీఆర్ స్వాధీనం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో కబ్జా చేసిన భూములు చాలవని, జిల్లాకో వెయ్యి ఎకరాల భూమిని కేసీఆర్ స్వాధీనం చేసుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ధరణి సమస్యలను పరిష్కరిస్తామని సంజయ్ హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెబుతూ కేసీఆర్ ఫాలనకు చరమ గీతం పాడాలని బీజేపీ నేత పిలుపిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే మార్పు సాధ్యం అని పేర్కొంటూ మతం పేరిట ప్రజలను విడదీస్తున్న కేసీఆర్ కుట్రలను గుర్తించాలని కోరారు. అందరూ ఏకమై కేసీఆర్ పాలనను అంతం చేయాలని పిలుపిచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తున్నారని సంజయ్  మండిపడ్డారు. ‘‘ రైతులందరికీ సన్న వడ్లు వేయాలని చెప్పి తన ఫాంహౌజ్ లో మాత్రం దొడ్డు వడ్లు వేసుకుని కోటీశ్వరుడైతున్నడు.. రైతులు మాత్రం బికారీలుగా మారుస్తున్నడు. కొన్ని ప్రాంతాల్లో వరి తప్ప వేరే పంట వేసే పరిస్థితి లేదు. కానీ వరి వేస్తే ఊరే గతి అని భయపెట్టిండు.. కనీసం ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించలేదు’’అని విమర్శించారు.