
ఉక్రెయిన్ దేశంపై దాడి చేసేందుకు నల్లసముద్రంలో పాగా వేసిన రష్యా మిస్సైల్ క్షిపణి మునిగిపోవడంతో ఒకరు మరణించారని, మరో 27 మంది అదృశ్యమయ్యారని రష్యా మొదటిసారి అంగీకరించింది.
ఉక్రెయిన్ దేశంలోని మారియుపోల్ నగరాన్ని ముట్టడించడంలో ప్రధానపాత్ర పోషించిన రష్యా క్షిపణి నౌక మునిగిపోయిన తర్వాత అందులోని నావికా సిబ్బంది అదృశ్యమయ్యారు. అనంతరం గల్లంతు అయిన రష్యా నావికా సిబ్బంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ పిల్లలు ఆచూకీ లేరంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
క్షిపణి నౌకలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా మందుగుండు సామాగ్రి పేలి మాస్కో క్షిపణి క్రూయిజర్ దెబ్బతిని మునిగి పోయిందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం ఆలస్యంగా తెలిపింది. నౌకలో ఉన్న ఒకరు మరణించగా, 27 మంది జాడ లేకుండా పోయారు. నౌకలోని 396 మందిని ఖాళీ చేయించామని రష్యా నావికాదళం అధికారులు చెప్పారు.
కాగా నల్ల సముద్రంలో మాస్కో యుద్ధ నౌక మునిగిపోయే ముందు రెండు ఉక్రెయిన్ క్షిపణులు ఢీకొన్నాయని పెంటగాన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
More Stories
రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
గాజా మారణకాండకు ముగింపుకు కైరోలో చర్చలు
పాకిస్థాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్పై మళ్లీ బాంబు దాడి