
రక్షణ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధార పడటం తగ్గించాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆయుధ కొనుగోళ్లలో బడ్జెట్‌లో అత్యధిక మొత్తం దేశీయ పరిశ్రమలకు చేరినట్టు తెలుస్తోంది. ముందస్తుగా నిర్దేశించుకున్న లక్షం ప్రకారం 64 శాతానికి పైగా ఆయుధ కొనుగోళ్లు దేశీయ పరిశ్రమల నుంచే జరిగినట్టు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
2021- 22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 65.50 శాతం ఆయుధ కొనుగోళ్ల బడ్జెట్ నిధులు దేశీయ పరిశ్రమలకే వెళ్లాయని ఆ ప్రకటనలో వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశించిన ఆత్మనిర్భర్ భారత్ అంచనాలకు మించి లక్షాన్ని సాధించిందని తెలిపింది. ఇదే ఆర్థిక సంవత్సరానికి 99.50 శాతం డిఫెన్స్ సర్వీసెస్ నిధులను వినియోగించుకొన్నట్టు రక్షణ శాఖ వెల్లడించింది.
మార్చి 2022 లో వెలువడిన ప్రాథమిక వ్యయ నివేదిక ఆధారంగా ఈ విషయం వెల్లడైందని పేర్కొంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం దేశీయ తయారీ రంగానికి ఊతం ఇచ్చే చర్యలు తీసుకొంది. ఈ క్రమంలో రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ రూట్‌లో 49 శాతం నుంచి 74 శాతానికి ప్రభుత్వం పెంచింది.
ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకొనే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. వచ్చే ఐదేళ్లలో భారత్ 130 బిలియన్ డాలర్లు విలువైన ఆయుధాలను కొనుగోలు చేయవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగుమతులను తగ్గించుకొని, దేశీయంగా తయారు చేసుకోవాలని నిర్ణయించింది.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
ట్రంప్ బెదిరింపులతో ఐటి రంగంపై భారత్ దృష్టి