
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుండి వైదొలిగిన వివాదాలు ఆయనను వెంటాడుతున్నాయి. తాజాగా, ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజనాకు చెందిన రూ.18 కోట్ల విలువైన నెక్లెస్‌ను బయట ఓ జ్యుయలరీకి విక్రయించారనే ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ మేరకు పాకిస్తాన్ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఏ విచారణ ప్రారంభించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు బహుమతిగా నెక్లెస్‌ను స్వీకరించారు. దీనిని పాకిస్తాన్ తొష-ఖానా (ప్రభుత్వ బహుమతుల నిధి)లో జమ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రధానికి మాజీ ప్రత్యేక సలహాదారు జుల్ఫీకర్ బుఖారీకి ఇచ్చారు.
ఆయన దీనిని లాహోర్‌లోని జ్యుయలరీకి రూ.18 కోట్లకు విక్రయించారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ న్యూస్‌పేపర్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ ఆరోపణలపై పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) విచారణ ప్రారంభించిందని పేర్కొంది.
వాస్తవానికి ప్రభుత్వ బహుమతులను ప్రధాని తన సహాయకుల వద్ద ఉంచవచ్చు. అయితే ఆ గిఫ్ట్ విలువలో సగం మొత్తం సొమ్ము డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనను పాటించకుండా కేవలం కొన్ని వందల రూపాయలు మాత్రమే పాకిస్థాన్ ఖజానాలో జమ చేశారని రిపోర్ట్ వివరించింది.
More Stories
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము
ఇరాన్‌పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్