మార్చిలో 20% పెరిగిన ఎగుమతులు

భారతదేశం సరుకుల ఎగుమతులు 2022 మార్చిలో 19.76 శాతం పెరిగి 42.22 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఎగుమతులు గతేడాది (2021 మార్చి)లో 35.26 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అదే సమయంలో దిగుమతులు 60.74 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 

2021 మార్చిలో 48.90 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 24.21 శాతం పెరిగింది. వాణిజ్య లోటు ఏడాది క్రితం 13.64 బిలియన్ డాలర్ల నుంచి 18.51 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022 మార్చిలో భారతదేశం సరుకుల ఎగుమతి, దిగుమతి, వాణిజ్య లోటు సేవా ఎగుమతుల విషయానికొస్తే, భారతదేశ సేవా ఎగుమతులు మార్చిలో 4.64 శాతం వృద్ధి చెంది 21.76 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

అంటే 2022 మార్చిలో భారతదేశం మొత్తం ఎగుమతి (సరకులు, సేవ) 14.15 శాతం పెరిగి 63.99 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇది 56.05 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022 మార్చిలో సేవా దిగుమతులు 7.33 శాతం పెరిగి 13.16 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

 2021 మార్చిలో ఇది 12.26 బిలియన్ డాలర్లుగా ఉంగి. అంటే మొత్తం దిగుమతులు 20.83 శాతం పెరిగి 73.90 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీని ప్రకారం మార్చిలో మొత్తం వాణిజ్య లోటు 9.91 బిలియన్ డాలర్లుగా ఉంది.