
దేశంలో ప్రభుత్వ పంపిణీ కార్యక్రమాల పరిధిలో పేదలకు బలవర్థక బియ్యం అందిస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పౌష్టికాహార లేమి నివారణకు ఈ బియ్యం సరఫరా నిర్ణయం తీసుకున్నారు.
దీనిని మూడు దశలలో అమలు చేస్తారు. ఇప్పటికే ఈ దిశలో భారత ఆహార సంస్థ (ఎఫ్సిఐ), పంపిణీ సంస్థలు 88.65 ఎల్ఎంటిల పౌష్టిక బియ్యాన్ని సరఫరాకు సేకరించాయని మంత్రి వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం తరువాత మంత్రి ఈ కీలక నిర్ణయం గురించి తెలిపారు.
తొలిదశలో ఈ బియ్యాన్ని ఐసిడిఎస్, పిఎం పోషన్ కార్యక్రమాల పరిధిలో పంపిణీ చేస్తారు. రెండో దశలో ప్రజా పంపిణీ వ్యవస్థల ద్వారా ఇతరత్రా సంక్షేమ పథకాల పరిధిలో దీనిని ప్రజలకు అందిస్తారు.
తుది దశలో పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో 2024 మార్చి నాటికి ఈ బలవర్థక బియ్యం పేదలకు అందుతుంది. దేశవ్యాప్తంగా దశలవారిగా ఈ బలవర్థక బియ్యం సరఫరాకు ఏటా రూ 2700 కోట్లు ఖర్చు అవుతుంది. దీనిని కేంద్రం భరిస్తుంది.
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ