ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఐపీఓ వచ్చే నెలలో ఉంటుందని బ్లూమ్‌బర్గ్ న్యూస్తెలిపింది. ఎల్ఐసీలో 7 శాతం వాటా అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎల్ఐసీ ఐపీఓ ద్వారా రూ. 50 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.
దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా ఎల్ఐసీ ఐపీఓ హిస్టరీ సృష్టించనుంది. లిస్టయిన తర్వాత వాల్యుయేషన్ పరంగా దేశంలోని టాప్ కంపెనీలయిన రిలయన్స్, టీసీఎస్‌ల సరసన ఎల్ఐసీ చేరుతుంది. మన దేశంలో ఇప్పటిదాకా అతి పెద్ద ఐపీఓగా పేటీఎం నిలుస్తోంది.
ఈ కంపెనీ 2021లో రూ.18,300 కోట్లకు ఐపీఓకి వచ్చింది. ఆ తర్వాత రూ.15,500 కోట్ల ఐపీఓతో కోల్ ఇండియా రెండో ప్లేస్‌లోనూ, రూ.11,700 కోట్ల ఐపీఓతో రిలయన్స్ పవర్ మూడో ప్లేస్‌లోనూ నిలుస్తున్నాయి. రిలయన్స్ పవర్ ఐపీఓ 2008లోనూ, కోల్ ఇండియా ఐపీఓ 2010లోనూ జరిగాయి.
డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ ప్రకారం 31.6 కోట్ల షేర్ల అమ్మకం ద్వారా రూ. 60 వేల కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ ఆలోచన. మే 12 దాకా ఎల్ఐసీ ఐపీఓ తేవడానికి గడువుంది. ఆలోపు పూర్తయితే సెబీ వద్ద మరోసారి పత్రాలు ఫైల్ చేయక్కర్లేదు. సెబీ అనుమతి గడువు ముగిసేలోపే ఐపీఓను తేవాలని ప్రభుత్వం చూస్తున్నది.
ఎంబెడ్డెడ్ వాల్యూతో పోలిస్తే ఒకటిన్నర రెట్లు వాల్యుయేషన్‌ను ఎల్ఐసీ కోరుకుంటోంది. ఐపీఓ ఆఫరింగ్ ఎలా ఉండాలనే దానిపై సీనియర్ ఆఫీసర్లు ఇంకా డిస్కస్ చేస్తున్నారు. ఎంత మొత్తం సమీకరించాలనేది కూడా మారే ఛాన్స్ ఉంది. బడ్జెట్ లోటు పూడ్చుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థలలోని వాటాలను అమ్మాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సెబీ వద్ద తాజాగా ఎల్ఐసీ పత్రాలను ఫైల్ చేశారు. ఇందులో డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్‌ను కూడా చేర్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎల్ఐసీ ఐపీఓ పేపర్లను సెబీ వద్ద ఫైల్ చేశారు. అప్పట్లో సెప్టెంబర్ దాకా ఫైనాన్షియల్ రిజల్ట్స్‌ను ఇచ్చారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మార్కెట్లో ఓలటాలిటీ పెరగడంతో ఐపీఓను వాయిదా వేశారు.
ఎల్ఐసీ ఐపీఓ కోసం చాలా మంది ఇన్వెస్టర్లు ఆసక్తితో ఎదురు చూస్తున్నారని డిజిన్వెస్ట్‌మెంట్ సెక్రటరీ తుహిన్ కాంత పాండే చెప్పారు. విజయవంతంగా పూర్తవుతుందనే నమ్మకం కుదిరినప్పుడే ఐపీఓ చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని అప్పట్లో ఆయన పేర్కొన్నారు.
సెప్టెంబర్30, 2021 నాటికి ఎల్ఐసీ ఎంబెడ్డెడ్ వాల్యూను రూ. 5.4 లక్ష కోట్లుగా లెక్కించారు. ఇంటర్నేషనల్ యాక్ట్యుయేరియల్ సంస్థ మిల్లిమాన్ అడ్వైజర్స్ ఈ వాల్యూ లెక్క కట్టింది. ఎల్ఐసీ మార్కెట్ వాల్యుయేషన్ఎంతనేది డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ చెప్పనప్పటికీ, ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే ఇది ఎంబెడ్డెడ్ వాల్యూకు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
ఎల్ఐసీ నికర లాభం మూడో క్వార్టర్లో రూ. 235 కోట్లు పెరిగింది. అంతకు ముందు ఏడాది మూడో క్వార్టర్లో ఇది రూ. 94 లక్షలు. డిసెంబర్ 2021తో ముగిసిన 9 నెలల కాలానికి చూస్తే లాభం రూ. 1,643 కోట్లు. అంతకు ముందు ఏడాది 9 నెలలకూ ఇది రూ. 7 కోట్లు మాత్రమే.

More Stories
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
బెంగాల్ లో 1000కి పైగా పౌరసత్వ శిబిరాల ఏర్పాట్లలో బీజేపీ
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం