సంజయ్ రౌత్ ఆస్తులు ఈడీ జప్తు

శివసేన ఎంపీ సంజయ్ రౌత్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేసింది. ఈడీ స్వాధీనం చేసుకున్నవాటిలో సంజయ్ రౌత్తో పాటు ఆయన కుమారుడికి చెందిన ఆస్తులు ఉన్నాయి.

ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ ప్రకారంఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్  జప్తు చేసిన ఆస్తుల్లో అలీబాగ్‌లో రూ.9 కోట్లు విలువచేసే ఎనిమిది ల్యాండ్ పార్సెల్స్ (ప్లాట్లు), ముంబైలోన దాదర్ శివార్లలో ఉన్న రూ.2 కోట్లు విలువచేసే ఒక ఫ్లాట్ ఉన్నాయి.  

ముంబైలోని ఓ భారీ రెసిడిన్షియల్ బిల్డింగ్ రీ-డవలప్‌మెంట్‌కు సంబంధించి రూ.1,034 కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్‌లో మనీ ల్యాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ జప్తు జరిగినట్టు చెబుతున్నారు.

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ ఆస్తులు అటాచ్ చేయడంపై సంజయ్ రౌత్ స్పందిస్తూ బాలాసాహెబ్ థాక్రే అనుచరుడు, శివ సైనికుడినైన తనను ఆస్తులు జప్తు చేసి, తుపాకీతో బెదిరింది, జైలుకు పంపి ఎవరూ భయపెట్టలేరని స్పష్టం చేశారు.  తాను ఏమాత్రం మౌనంగా ఉండనని, ప్రతి ఒక్కరి భాగోతాన్ని బయటపెడతానని హెచ్చరించారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు.

ఈడీ ఆస్తులు జప్తు చేయడానికి కొన్ని గంటల ముందే సంజయ్ రౌత్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి లేఖ రాశారు. పట్రాచాల్ భూ కుంభకోణానికి సంబంధించి ఈడీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఆ లేఖలో ఆరోపించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నాయని రౌత్ ఫిర్యాధు చేశారు.