
కశ్మీర్లో సోమవారం ఉగ్రవాదుల తుపాకీ తూటాలకు ఓ జవాను.. ఒక కశ్మీరీ పండిట్.. ఇద్దరు కార్మికులు బలైపోయారు. శ్రీనగర్లోని మైసుమా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవానులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఆస్పత్రిలో ఒకరు మరణించారు. మరొకరు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. పుల్వామా జిల్లా లజూరా ప్రాంతంలో బిహార్ నుంచి జీవనోపాధికి వచ్చిన ఇద్దరు కార్మికులు చనిపోయారు.
షోపియాన్ జిల్లాలోని చోటోగామ్లో షాప్ కీపర్ అయిన ఓ కశ్మీరీ పండిట్పై కాల్పులు జరిపారు. బాధితుడిని సోను కుమార్ బాల్జీగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.
కాగా, గత 24 గంటల్లో ఉగ్రవాదులు ఏడుగురిపై కాల్పులు జరిపారు. పుల్వామాలో జరిగిన దాడిలో గాయపడిన వారిలో నలుగురు స్థానికేతరులు కూడా ఉన్నారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్