రాజ్యసభలో బిజెపి సభ్యుల సంఖ్య 100 మార్క్ దాటింది. గత 30 ఏళ్లలో రాజకీయ పార్టీకి రాజ్యసభలో 100, అంతకన్నా ఎక్కువమంది సభ్యులు ఉండటం ఇదే ప్రధమం కావడం గమనార్హం. తాజాగా, పెద్దల సభలో బీజేపీ సభ్యుల సంఖ్య 101కి చేరింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ సాధించడంతో ఎగువసభలో బీజేపీ సంఖ్యా బలం 101 ఎంపీలకు చేరుకుంది. గురువారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 13 స్థానాలకు గాను బీజేపీ 4 సీట్లు గెలుచుకుని ఈ అరుదైన ఫీట్ సాధించింది. అసోంలో బీజేపీ భాగస్వామ్య పార్టీ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) ఒక రాజ్యసభ సీటు గెలుచుకుంది. మూడు ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపుర, నాగాలాండ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది.
అసోం నుంచి రాజ్యసభకు ఇద్దరు ఎన్డీయే అభ్యర్థులను భారీ ఓట్ల తేడాతో ఎన్నుకోవడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీపై అంతా విశ్వాసాన్ని చాటుకున్నారని, విజేతలకు తన అభినందనలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఒక ట్వీ్ట్‌లో తెలిపారు.
రాజ్యసభలో బీజేపీ 100 మార్క్‌ను దాటడంతో వచ్చే ఆగస్టులో జరగనున్న ఉపాధ్యక్ష ఎన్నికల రేసులో బీజేపీకి తిరుగుండదు. అలాగే, ఈశాన్య రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం లేకపోవడం కూడా కాంగ్రెస్‌కు ఇదే మొదటిసారి.
ఆరు రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు ఇటీవల జరిగిన ద్వైవార్షిక ఎన్నికలలో బీజేపీ పంజాబ్ నుండి తన స్థానాన్ని కోల్పోయింది. అయితే మూడు ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్కొక్కటి చొప్పున గెలుచుకుంది. ఇక్కడ ఐదుగురు అవుట్‌గోయింగ్ సభ్యులు ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు.
ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయంతో రాష్ట్రంలోని మొత్తం ఐదు సీట్లు ఆ పార్టీ గెలుచుకుంది. దీంతో రాజ్యసభలో ఆప్ సంఖ్యా బలం ఎనిమిదికి పెరిగింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం ఐదు సీట్లు తక్కింది. కేరళ మూడు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింటీలో ఎల్‌డిఎఫ్ కూటమి విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక స్థానానికి పరిమితమైంది.
245 మంది సభ్యుల సభలో మెజారిటీ తక్కువగా ఉన్నప్పటికీ.. 2014 ఎన్నికలలో లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెజారిటీకి నాయకత్వం వహించినప్పటి నుండి బిజెపి సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2014లో రాజ్యసభలో బీజేపీ బలం 55 కాగా, ఆ పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో అప్పటి నుంచి క్రమంగా పుంజుకుంది.
ఎగువ సభలో చివరిసారిగా 100 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు 1990లో అప్పటి పాలక కాంగ్రెస్‌కు 108 మంది సభ్యులున్నారు. 1990 ద్వైవార్షిక ఎన్నికలలో దాని సంఖ్య 99కి పడిపోయింది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో పార్టీ బలహీన పడడంతో క్రమంగా ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది.
ఏది ఏమైనప్పటికీ మరో 52 స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనుండగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ బలం మరింతగా కోల్పోయే అవకాశం ఉంది. మరోవంక బీజేపీ మరింత పట్టు పెంచుకునే అవకాశాలున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఆశించిన 11 ఖాళీలలో కనీసం ఎనిమిది స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఆశించిన లాభాలను భర్తీ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఉత్తరప్రదేశ్ నుంచి పదవీ విరమణ చేయనున్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో ఐదుగురు బీజేపీకి చెందిన వారు.

More Stories
పాక్ అధికారులపై ఆంక్షలు.. అమెరికా కాంగ్రెస్ సభ్యుల వినతి
గంగ, ఓల్గా నదుల స్ఫూర్తి భారత్- రష్యాలకు మార్గనిర్ధేశం
జమిలి ఎన్నికలకు అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు