భారత్ లో మెరుగైన ప్రసూతి మరణాల నిష్పత్తి

భారత్ లో మెరుగైన ప్రసూతి మరణాల నిష్పత్తి
భారతదేశ ప్రసూతి మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్‌) కాస్త మెరుగుపడింది. 2017-19 మధ్య కాలానికి 103కి చేరింది. కానీ, కొన్ని రాష్ట్రాలలో మాత్రం ఇది ఆందోళనకరంగా మారింది. శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్స్‌ (ఎస్‌ఆర్‌ఎస్‌) అంచనాల ప్రకారం ఇది తెలిసింది. దీనిని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది.

దీని ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌, హర్యానా, ఉత్తరాఖండ్‌ లలో ఎంఎంఆర్‌ మరింత దిగజారింది. 2020 డేటా ప్రకారం.. 2016-18 కాలంలో, భారత్‌ ఎంఎంఆర్‌ 2015-17లో 7.4 శాతం తగ్గింది. ఇది 113గా ఉన్నది. భారత ఎంఎంఆర్‌ 1990లో 556 కాగా, 2004-06లో 254గా ఉన్నది.

ఒక ప్రాంతంలో మాతా శిశు మరణాలు ఆ ప్రాంతంలోని స్త్రీల పునరుత్పత్తికి కొలమానం. ఎంఎంఆర్‌ అనేది అదే సమయంలో లక్ష సజీవ జననాలకు ఒక నిర్దిష్ట వ్యవధిలో ప్రసూతి మరణాల సంఖ్యగా నిర్వచించారు.  ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌డిజి) లక్ష్యం ప్రపంచ ప్రసూతి మరణాల నిష్పత్తిని లక్ష సజీవ జననాలకు 70 కంటే తక్కువకు తగ్గించడం. 
 
తాజా సమాచారం ప్రకారం.. కర్నాటక (83) మినహా అన్ని దక్షిణాది రాష్ట్రాలు కేరళ (30), మహారాష్ట్ర (38), ఆంధ్రప్రదేశ్‌ (58), తెలంగాణ (56), తమిళనాడు (58) అత్యల్ప ఎంఎంఆర్‌ను కలిగి ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌ (109), హర్యానా (96), ఉత్తరాఖండ్‌ (101), ఛత్తీస్‌గఢ్‌ (160) వంటి రాష్ట్రాల్లో ఈ నిష్పత్తి మరింత దిగజారింది.
 
 2020 డేటా ప్రకారం, పశ్చిమ బెంగాల్‌ ఎంఎంఆర్‌ 98, హర్యానా 91, ఉత్తరాఖండ్‌ 99, చత్తీస్‌గఢ్‌ 159గా ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో ఎంఎంఆర్‌ 150 కంటే ఎక్కువగా ఉన్నది. ఇది యుఎన్‌ ఎస్‌డిజి లక్ష్యం కంటే చాలా ఎక్కువ.

2016-18లో 197తో పోలిస్తే 2017ా-19లో యూపీ ఎంఎంఆర్‌ 167 గా ఉన్నది. అసోం ఎంఎంఆర్‌ 215 కాగా, ప్రస్తుతం 205. మధ్యప్రదేశ్‌ ఎంఎంఆర్‌ 173గా ఉండగా, ప్రస్తుతం ఇది 163గా ఉన్నది. రాజస్థాన్‌ తన ఎంఎంఆర్‌ను 2016ా-18లో 164 నుంచి 2017ా-19లో 141కి పెంచుకోగలిగింది. అదేవిధంగా, బీహార్‌ కూడా తాజా సర్వేలో 2016ా18లో 149 ఎంఎంఆర్‌ను 130కి మెరుగపరుచుకున్నది.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం.. అనేక అభివృద్ధి చెందిన దేశాలు విజయవంతంగా ఎంఎంఆర్‌ను సింగిల్‌ డిజిట్‌కు తగ్గించాయి. ఇటలీ, నార్వే, పోలాండ్‌, బెలారస్‌ లు అత్యల్ప ఎంఎంఆర్‌ను కలిగి ఉన్నాయి. 
 
జర్మనీ, యూకే రెండింటిలో ఇది ఏడు, కెనడాలో 10, యూస్‌లో 19గా ఉన్నది. భారత్‌ పొరుగుదేశాలు నేపాల్‌ (186), బంగ్లాదేశ్‌ (173), పాకిస్థాన్‌ (140) లు అధిక ఎంఎంఆర్‌ను కలిగి ఉన్నాయి. చైనా, శ్రీలంక వరుసగా 18.3, 36 ఎంఎంఆర్‌లతో ముందంజలో ఉన్నాయి.