
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపుర రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించబోతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. త్రిపురలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాజధాని అగర్తలాలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిపురలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చేసిన అభివృద్ధిని, మున్ముందు చేయబోయే పనుల గురించి ప్రస్తావించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రపంచంతో త్రిపురకు మరింత అనుసంధానం పెరిగిందని చెప్పారు.
“రాష్ట్రంలో రైల్వే లైన్లు పెరిగాయి. నాలుగేళ్లలో 542 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించాము. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో నేరాలు 30 శాతం తగ్గాయి’’ అని అమిత్ షా పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపైందని తెలిపారు. ప్రస్తుతం రైతుల ఆదాయం 1.3 లక్షలకు చేరిందని చెప్పారు.
ఇక ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ యంత్రాగాల్లోని ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించబోతున్నట్లు ప్రకటించారు.
తాను మళ్లీ త్రిపురకు వస్తానని చెప్పిన అమిత్ షా.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను విప్లవ్ దేవ్ ప్రభుత్వం నెరవేరుస్తోందని అభినందించారు. తాను మళ్లీ త్రిపురకు వస్తానని, ఓట్లు అడుగుతానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.
More Stories
విజయ్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురు.. సిట్ విచారణకు ఆదేశం
ఆర్ఎస్ఎస్ అంకితభావం, సేవకు అరుదైన ఉదాహరణ.. దలైలామా
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు