బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా మరో వివాదంలో చిక్కుకుంది. చీటింగ్ కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి సోనాక్షి సిన్హా ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ముందుగా ఈవెంట్ మేనేజర్ నుంచి రూ 37 లక్షలు తీసుకుంది.
కానీ ఈ కార్యక్రమానికి ఆమె హాజరుకాలేదు. దీంతో ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ డబ్బులు తిరిగి ఇవ్వాలని దబాంగ్ నటి మేనేజర్ ను అడిగినా అతడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అనంతరం సోనాక్షి సిన్హాను కలుసుకునేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
దీంతో శర్మ మొరాబాబాద్ లోని కత్ ఘర్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సోనాక్షిపై చీటింగ్ కే సు నమోదు చేశారు. కేసు విచారణ నిమిత్తం సోనాక్షి మొరాబాద్‌కు రావాల్సి ఉండగా ఆమె హాజరు కాలేదు. దీంతో స్థానిక కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

More Stories
ఢిల్లీలో కురవనున్న తొలి కృత్రిమ వర్షం
ఢిల్లీలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్ .. భారీ ఉగ్రకుట్ర భగ్నం
పంజాబ్ ప్రభుత్వ పాఠశాల గోడపై ఖలిస్థాన్ నినాదాలు