
మహారాష్ట్ర లోని పూణే నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెట్రోను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మొత్తం 32.2 కిలోమీటర్ల పూణే మెట్రోలో ఇప్పటికే పూర్తయిన 12కి.మీ మార్గంలో మెట్రో ప్రయాణం మొదలయ్యింది.
గర్వారే మెట్రో స్టేషన్లో జెండా ఊపి రైలు సేవలను ప్రారంభించిన ప్రధాని టికెట్ కొనుక్కుని మరీ మెట్రోలో ప్రయాణించారు. గర్వారే మెట్రో స్టేషన్ నుంచి ఆనంద్ నగర్ స్టేషన్ వరకు ప్రయాణికులతో కలిసి వెళ్లారు. మెట్రో రైలు రాకతో పుణెలో అర్బన్ మొబిలిటీ కోసం అంతర్జాతీయ శ్రేణి మౌలిక ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినట్లయింది.
స్వయంగా ప్రధాని టికెట్ కొనుక్కుని మరీ చిన్నారులతో కలిసి ప్రధాని మెట్రోలో ప్రయాణించారు.పూణే మెట్రోలో తన ప్రమాణానికి సంబంధించిన ఫోటోలను ప్రధాని సోషల్ మీడియా వేదికన పంచుకున్నారు.
”నా యువ మిత్రులతో కలిసి పూణే మెట్రోలో ప్రయాణం” అనే క్యాప్షన్ కు మెట్రో ప్రయాణం ఫోటోలను జతచేసి పీఎం మోదీ ట్వీట్ చేసారు.గతంలో డిసెంబర్ 26, 2016లో ప్రధాని మోదీ చేతుల మీదుగానే పూణే మెట్రో శంకుస్థాపన జరిగింది. మొత్తం 32.2 కిలోమిటర్లు మెట్రో నిర్మాణాన్ని రూ.11,400కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటివరకు పూర్తయిన 12 కిలోమీటర్ల దూరాన్ని ప్రధాని ప్రారంభించారు. ఇదిలావుంటే మరో 100 ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు పూణేలో రోడ్డెక్కాయి. ప్రస్తుతం పూణేలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఈ ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. బస్సుల చార్జింగ్ కోసం ఏర్పాటుచేసిన ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా పీఎం ప్రారంభించారు.
ఆదివారం ఉదయం మహారాష్ట్రకు చేరుకున్న ప్రధాని మోదీ తొలుత పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 9.5 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని పీఎంసీ ఏర్పాటు చేసింది.
More Stories
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్