
దర్గాలో ఉన్న శివలింగంపై పూజలు చేయడానికి వెళ్లిన కేంద్ర మంత్రి, బిజెపి ఎమ్యెల్యే, ఇతర నాయకులు, హిందూ సంస్థల ప్రతినిధులపై, వారి వాహనాలపై రాళ్ళ వర్షం కురిపించారు. ఈ దందర్భంగా పోలీసులు 167 మంది అరెస్ట్ చేసిన సంఘటన కర్ణాటకలో జరిగింది.
అరెస్ట్ అయిన వారిలో 10 మంది మహిళలు కూడా ఉన్నారు. మరి కొంతమంది కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాబురిగి జిల్లాలోనే అలందలోని లాడ్లే మషక్ దర్గాలో నెలకొన్న శివలింగంకు పూజలు చేయడానికి వెల్లన్నప్పుడు ఈ దాడి జరిగింది.
అదే రోజు ముస్లింలు అక్కడ ప్రత్యేక పూజలు తలపెట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. అదనపు పోలీసులను మోహరింపు చేశారు.
ఈ దర్గాలో రాఘవ చైతన్య శివలింగ ప్రతిష్ట జరిగింది. అయితే శివలింగం ప్రాంతంలో కొందరు అపరిశుభ్రంగా చేయడంతో వివాదం చెలరేగింది. శివరాత్రి రోజున శివలింగాన్ని శుభ్రం చేసి, పూజలు జరుపుతామని హిందూ సంస్థలు ముందుగా ప్రకటించాయి.
మరోవంక, స్థానిక ముస్లింలు అదే రోజున షేర్డ్ దర్గా వద్ద చనిపోయిన వారికి నివాళులర్పించేందుకు షబాబ్-ఎ-బారాత్ గుర్తుగా ఊరేగింపు జరపాలని నిర్ణయించారు.
ప్రత్యేక పూజలు జరపడానికి కేంద్ర మంత్రి, బీదర్ ఎంపీ భగవత్ ఖుబా, ఎమ్మెల్యే బసవరాజ్ మూతిముడా, మాజీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పాటిల్ తదితరులు శివరాత్రి రోజున వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కలెక్టర్, ఎస్పీ రాజీ చేసి అందరిని పంపించి వేశారు.
ఆ సమయంలో ఇరువర్గాలతో శాంతి చర్చలు జరిపిన కలెక్టర్ యశవంత్ గురుకుల్, ఎస్పీ ఇషా పంత్ 12 మంది మాత్రం వెళ్లి ప్రత్యేక పూజలు జరపడానికి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు చేయడం కోసం కేంద్ర మంత్రి, ఎమ్యెల్యేలు, ఇతరులు వెడుతున్న సమయంలో రాళ్ళ దాడి జరిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఐదు కేసులను నమోదు చేశారు.
ఈ సంఘటనలకు ముందు, శ్రీరామ్ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్, హిందూ కార్యకర్త చైత్ర కుందాపుర, సిద్దలింగ స్వామిలను మార్చి 3 వరకు జిల్లాలోకి ప్రవేశింప కుండా కలబురగి పోలీసులు నిషేధించారు. అయితే, హిందూ సంఘాలు నిషేధ ఉత్తరువులు మధ్య ప్రణాళిక ప్రకారం అలంద్ బస్టాండ్ నుండి ఊరేగింపును చేపట్టాయి.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్